రిపబ్లిక్ డే వేడుకలకు డబ్బుల్లేవా? పాక్ లో దారుణ పరిస్థితి

తాజా రంజాన్ పర్వదినం నేపత్యంలో తాము చేస్తున్న పోరాటానికి తాత్కాలిక విరామాన్ని ప్రకటించాయి. రంజాన్ నెల ముగిసే వరకు పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.;

Update: 2026-03-19 04:54 GMT

పాకిస్థాన్ లో పైసల పంచాయితీ ఎంత దారుణంగా ఉందనటానికి నిదర్శనంగా ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. గడిచిన కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దాయాది దేశం.. ఇప్పుడు ఆ దేశ రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించుకోవటానికి కూడా తగిన నిధులు లేక.. వేడుకల్ని రద్దు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఓపెన్ గా డబ్బుల్లేక అన్న మాట చెప్పకుండా.. తాజాగా జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పొదుపు చరర్యల్లో భాగంగా ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించటం లేదని పేర్కొన్నారు.

తాజాగా నడుస్తున్న గల్ఫ్ చమురు సంక్షోభం.. పెరుగుతున్న చమురు ధరలు.. ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల నేపథ్యంలో ఈ నెల 23న నిర్వహించాల్సిన రిపబ్లిక్ డే వేడుకల్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ వేడుకల్లో భాగంగా సైనిక కవాతు.. 31 గన్ సెల్యూట్.. కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి ఈసారి జరగవని చెబుతున్నారు. అందుకు బదులుగా కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహిస్తారని పేర్కొన్నారు.. మంత్రిత్వ శాఖలన్ని జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించాలని.. ఈ కార్యక్రమాల్ని వీలైనంత నిరాడంబరంగా.. గౌరవప్రదంగా పాటించాలని ఆదేశించారు.

ఓవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. మరోవైపు తన ఇరుగున ఉన్న అఫ్గాన్ మీద దాడుల్ని తీవ్రతరం చేయటం గమనార్హం. అఫ్గాన్ రాజధాని కాబూల్ లో జరిగిన వైమానిక దాడి నేపథ్యంలో.. తాజా రంజాన్ పర్వదినం నేపత్యంలో తాము చేస్తున్న పోరాటానికి తాత్కాలిక విరామాన్ని ప్రకటించాయి. రంజాన్ నెల ముగిసే వరకు పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. దీనికి ముందు సౌదీ అరేబియా.. టర్కీ.. ఖతార్ వినతి మేరకుఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ కాల్పుల విరమణ మార్చి 19అర్థరాత్రి నుంచి మార్చి 24 అర్థరాత్రి వరకు అమల్లో ఉంటుందని పాక్ సమాచార మంత్రి అత్తావుల్లా తారర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి భిన్నంగా సరిహద్దు దాటి దాడులు. డ్రోన్ దాడులు.. ఏదైనా ఉగ్రవాద సంఘటన చోటు చేసుకుంటే మాత్రం ఆపరేషన్లు వెంటనే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News