ఆ నేతలపై.. చంద్రబాబు ఆరా.. యాక్షన్ స్టార్ట్ చేస్తారా?
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజానికి ఇటీవలే రాష్ట్ర, జాతీయస్థాయిలో కమిటీలను ఆయన నియమించారు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజానికి ఇటీవలే రాష్ట్ర, జాతీయస్థాయిలో కమిటీలను ఆయన నియమించారు. అలాంటిది.. ఇప్పుడు మరోసారి ప్రక్షాళన ఏంటనే ప్రశ్న సహజంగానే తెలుత్తుంది. దీనికి కారణం.. మహానాడుకు ముందు.. తర్వాత జరి గిన పరిణామాలేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో పనిచేయని వారితోపాటు.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ముందుగా..
తొలుత.. ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న పార్టీ అధిష్టానం ఏయే నియోజకవర్గాల్లో నాయకులు వెనుక బడ్డారు అనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. వీటిలో కీలకమైన జిల్లాలను, నియోజకవర్గాలను పరిగణ నలోకి తీసుకుని.. వాటిని సరిచేయడమో.. లేక నాయకులను మార్చడమో చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 165 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. వీరిలో కొందరు వెనుకబడ్డారు. మరికొందరు సర్కారుకు అనుగుణంగా పనిచేస్తున్నారు.
అయితే.. ఇంకొందరు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మద్యం, ఇసుక, మట్టి సహా.. ఇతర వ్యాపారాలు, వ్యవహారాల్లో మునిగితేలుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి వారిని ఇంకా ఉపేక్షిస్తే మొత్తానికే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న చంద్రబాబు.. వారిలో మార్పునకు లేదా.. తానే మారేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల పరిస్థితి ఎలా ఉన్నా.. పార్టీపై బ్యాడ్ నేమ్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మంత్రివర్గ ప్రక్షాళన..
త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన ఉన్న నేపథ్యంలో గ్రాఫ్, మార్కులు, ప్రజల్లో ఉన్న సానుభూతి, సానుకూ ల కోణాలను ఆధారంగా చేసుకుని మంత్రివర్గాన్ని మార్పులు చేసే దిశగా కూడా చంద్రబాబు ప్రయత్ని స్తున్నారు. దీనికి ముందు పార్టీ పరంగా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెడతారని సీనియర్ నేత ఒకరు ఆఫ్ దిరికార్డుగా మీడియా కు చెప్పడం గమనార్హం. వైసీపీ వ్యూహాలకు అనుగుణంగా ముందుకు సాగని నాయకులు తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పడం విశేషం.