ప్రాంతం కాదు.. ప్రతిభే ముఖ్యం కవితక్కా.. నీట్ గా ఇచ్చిపడేసిన లోకేష్

హైదరాబాద్‌లో ఉద్యోగాల గురించి కవితక్క చేసిన కామెంట్స్‌కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Update: 2026-06-27 12:01 GMT

తెలంగాణ వచ్చి దశాబ్దం దాటిపోయింది. బాహుబలి పార్ట్-2 కూడా వచ్చి ఎన్నేళ్లో అయిపోయింది. కానీ కొందరికి మాత్రం ఇంకా పాత రికార్డులే తిరగేయడం అలవాటుగా మారినట్లుంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే... "ఇంకా మారలేదు మీరూ.. ఇంకా పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లేనా?" అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగాల గురించి కవితక్క చేసిన కామెంట్స్‌కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

కవితక్క మార్క్ 'హైదరాబాద్' సెంటిమెంట్

విషయంలోకి వెళ్తే... ఒక కార్యక్రమంలో మాట్లాడిన కవితక్క, తనదైన శైలిలో ప్రాంతీయ సెంటిమెంట్‌ను మళ్లీ కెలికే ప్రయత్నం చేశారు. "తెలంగాణ పిల్లలు చదువుకోడానికో ఉద్యోగాలకో ఏపీకి వెళ్లడం లేదు. కానీ ఏపీ పిల్లలే ఇక్కడికి వస్తున్నారు. ఇకపై హైదరాబాద్‌లో వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకూడదు" అనే రేంజ్‌లో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "అబ్బా.. ఏం ఐడియా కవితక్కా! గ్లోబల్ సిటీ అని చెప్పుకునే హైదరాబాద్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసి, గేట్ పాస్ ఉన్నవాళ్లనే లోపలికి రానిద్దామా ఏంటి?" అంటూ నెటిజన్లు అప్పుడే సెటైర్ల వర్షం కురిపించడం స్టార్ట్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుంటే చాలు.. ఇలాంటి ప్రాంతీయ భావోద్వేగాల 'బిర్యానీ' వండటం కొందరికి అలవాటేగా!

లోకేష్ క్లాస్ రూమ్.. 'పరిపక్వ' సమాధానం!

కవితక్క విసిరిన బంతికి, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏమాత్రం ఆవేశపడకుండా కూల్‌గా.. అంతే స్ట్రాంగ్‌గా సిక్స్ కొట్టారు. ప్రాంతీయ అహంకారానికి, ప్రతిభ గల ఆలోచనకు ఉన్న తేడా ఏంటో తన పోస్టుతో చూపించారు. "కవితక్కా.. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా విను. మేము నిర్మిస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ ఇదే. ఇక్కడ నువ్వు ఏ ఊరు, ఏ జిల్లా, ఏ రాష్ట్రం అనేది ముఖ్యం కాదు. నీలో ఏముంది? నీ ప్రతిభ ఏంటి? నువ్వు ఎలాంటి విలువను సృష్టించగలవు? అనేది మాత్రమే ముఖ్యం. మీ మూలాలను మీరు గౌరవించుకోండి, తప్పులేదు. కానీ రాష్ట్ర సరిహద్దులు యువత అవకాశాలను, వాళ్ల భవిష్యత్తును డిసైడ్ చేయకూడదు. ఆంధ్రప్రదేశ్‌ను కేవలం ఒక ప్రాంతంగా చూడకండి.. ఇదొక భవిష్యత్తు!" అంటూ లోకేష్ నీట్‌గా లెక్క తేల్చేశారు.

గ్లోబల్ వరల్డ్.. లోకల్ మైండ్ సెట్!

ప్రస్తుతం ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతోంది. అమెరికాలో కూర్చుని బెంగళూరు కంపెనీకి, హైదరాబాద్‌లో కూర్చుని లండన్ కంపెనీకి 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేస్తున్న రోజులివి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు 'నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు?' అని అడగడం లేదు, 'నీకు కోడింగ్ వచ్చాదా? లేదా?' అని మాత్రమే అడుగుతున్నాయి.

ఇలాంటి 2026 డిజిటల్ యుగంలో కూడా.. "నువ్వు ఆంధ్రా.. నేను తెలంగాణ.. నీకు ఉద్యోగం లేదు" అంటూ బోర్డులు పెట్టాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ఐటీ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. లోకేష్ ఇచ్చిన కౌంటర్ చూశాక.. "రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కాలం చెల్లిపోయింది కవితక్కా.. ఇప్పటికైనా గ్లోబల్ ట్రెండ్స్ గమనించండి" అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గట్టిగానే 'క్లాస్' పీకుతున్నారు. మొత్తానికి, లోకేష్ తన పరిపక్వతతో కూడిన స్పందనతో ఈ మ్యాచ్‌లో వన్-సైడెడ్ విక్టరీ కొట్టేశారనే చెప్పాలి

Tags:    

Similar News