గిద్దలూరు ఎమ్మెల్యే ర్యాంక్ 133/175

ఇక వేదిక మీద ముఖ్యమంత్రి పక్కనే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పసుపు చొక్కా వేసుకుని నిలబడి ఉన్నారు.

Update: 2026-06-27 19:11 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఒంగోలు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన ఒక సభలో ఏకంగా గిద్దలూరు ఎమ్మెల్యే పని తీరు మీద ర్యాంక్ ని బహిరంగంగా చెప్పారు. ఎదురుగా ప్రజలు వేదిక మీద అధికారులు ఇతర నేతలు అందరూ చూస్తూండగానే ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పనితీరు ఇదీ అంటూ ర్యాంక్ ని వెల్లడించడం విశేషం. బహుశా ఇలాంటి విషయం దేశంలో ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. నేరుగా ఎమ్మెల్యేలకే ర్యాంకుల గురించి కానీ వారి పనితీరు మీద కానీ అధినేతలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల సాక్షిగా దీనిని రివీల్ చేశారు.

సర్వీసులు ఎబోవ్...బిలో అంటూ :

ఇక వేదిక మీద ముఖ్యమంత్రి పక్కనే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పసుపు చొక్కా వేసుకుని నిలబడి ఉన్నారు. ఇక చంద్రబాబు అశోక్ రెడ్డి గారూ అని పిలుస్తూ రాష్ట్రంలో 31 సర్వీసులు రాష్ట్రంలో బిలో, 14 సర్వీసులు ఎబొవ్ అని వివరించారు. అంతే కాకుండా లాస్ట్ ట్వంటీ డేస్ లో 11 సర్వీసులు స్టేట్ ఏవరేజ్ కంటే ఎబొవ్ అని 23 సర్వీసులు బిలో అని తెలిపారు. నేను ముందే చెప్పాను మీకు. మీ నియోజకవర్గం 133వ ప్లేస్ లో ఉందని చంద్రబాబు అన్నారు. మొన్నటి వరకూ 124లో ఉంది, ఇపుడు 133లో ఉంది. ఇక్కడ ప్రజల రియాక్షన్ కూడా చూశారు. నేను వేరే నియోజకవర్గంలో మాట్లాడితే ప్రజలు అంతా అధికారులు బాగా చేశారు అని అభినందించారు. ఈ నియోజకవర్గం ప్రజలలో అలజడి ఉంది అని చంద్రబాబు అన్నారు. కలెక్టర్ ఇక్కడే ఉన్నారు అని అంటూ నియోజకవర్గం సెట్ ఇంకా కాలేదని ఓపెన్ గానే చంద్రబాబు చెప్పారు.

ఆకస్మిక పర్యటనలు చేస్తా :

అందుకే తాను మళ్ళీ మళ్లీ గిద్దలూరు నియోజకవర్గానికి పర్యటనకు వస్తాను అని ఆకస్మిక పర్యటనలు కూడా చేస్తాను అని చంద్రబాబు సభాముఖంగా చెప్పుకొచ్చారు. నియోజకవర్గం సెట్ అయ్యేంతవరకూ తాను వస్తూనే ఉంటాను అని చంద్రబాబు చెప్పడం విశెషం. ఇదిలా ఉంటే ర్యాంకుల గురించి ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి బయటపెట్టడం అధికారుల విషయం మాట్లాడడం ప్రజలలో అలజడి ఉందని చెప్పడం వంటివి ఇక్కడ గమనంలోకి తీసుకుంటే ప్రతీ నియోజకవర్గం మీద కూటమి ప్రభుత్వం ఎంతగా ఫోకస్ పెడుతోంది అన్నది అర్థం అవుతోంది. అంతే కాదు రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఏ తీరున ఎంత మేరకు అమలు జరుగుతున్నాయన్న దాని మీద పక్కా డేటాతోనే ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినపుడు అధికారులను ఈ విషయం మీద అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో సంబంధిత ఎమ్మెల్యేలను కూడా అలెర్ట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ కి సంబంధించి రిపోర్టుని నేరుగా ప్రజలకే తెలియచేయడం ద్వారా ఎక్కడ ఏమి జరుగుతోంది అన్నది కూడా పారదర్శకంగా వెల్లడించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లుగా అర్ధం అవుతోంది.

Tags:    

Similar News