ఏపీ మెట్రో కార్పొరేషన్ కు విదేశీ రుణం! విజయవాడలో కీలక సమావేశం
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుకు విదేశీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది;
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుకు విదేశీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలోని ప్రముఖ హోటల్ లో వివిధ విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి సమావేశమై రుణ సమీకరణపై చర్చించారు. ఈ సమావేశానికి KFW, AFD, ADB, NDB, AIIB, జైకాతోపాటు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. విజయవాడ మెట్రో కారిడార్ ప్రతిపాదిత రూట్ ను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. రెండు మెట్రో ప్రాజెక్టులకు దాదాపు రూ.12,000 కోట్లు ఖర్చు అవుతుందని మెట్రో రైల్ కార్పొరేషన్ బ్యాంకర్ల దృష్టికి తీసుకువచ్చింది.
విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ రామక్రిష్ణారావు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చించనున్నట్లు చెబుతున్నారు.
విశాఖ, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్ ను ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో తొలిదశ కింద 46 కిలోమీటర్ల దూరంలో మూడు కారిడార్లను నిర్మించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ - కొమ్మాది రూట్లో 34 కిలోమీటర్లు, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు రెండో కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్ నిర్మించనున్నారు.
విజయవాడ మెట్రో రైల్ రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో రెండు కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మంచేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏలో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్ 1ఏ, 1బి లను 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని డీపీఆర్లో ప్రతిపాదించారు. ఇక రెండో దశలో నిర్మించే మూడో కారిడార్ను 27.5 కిలోమీటర్ల మేర నిర్మిం