ఏమిటీ బ్లూటూత్ ట్రెండ్.. హనీమూన్ స్పాట్ కాస్తా హెచ్ ఐవీ సెంటర్

డ్రగ్స్ కొనుక్కునేందుకు డబ్బులు లేని వాళ్లు.. అప్పటికే డ్రగ్స్ కిక్కులో మునిగితేలుతున్న వారి రక్తాన్ని తీసుకొని.. తమ ఒంట్లో ఎక్కించుకోవటమే ఈ బ్లూటూత్ ట్రెండ్ గా చెబుతున్నారు.;

Update: 2026-02-07 04:28 GMT

ఫిజీ.. పసిఫిక్ దేశంగా మాత్రమే కాదు పాపులర్ హనీమూన్ స్పాట్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పేవారు. కొత్తగా వైవాహిక జీవితాన్ని స్టార్ట్ చేసినోళ్లు.. ఈ పాపులర్ టూరిస్టు స్పాట్ కు వెళ్లి కొన్ని రోజులు గడిపితే.. ఆ ఆనందమే వేరుగా చెప్పేశారు. నేచర్ ఒడిలో ఎంజాయ్ చేసే రోజులు జీవితంలో ఇస్పెషల్ గా మారతాయన్న భావన ఉండేది. అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పటివరకు పాపులర్ హనీమూన్ స్పాట్ గా ఉన్న ఫిజీ కాస్తా ఇప్పుడు హెచ్ ఐవీకి కేరాఫ్ అడ్రస్ గా చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు.. అంతర్జాతీయ మీడియా రిపోర్టు ఆధారంగా చూస్తే.. 2024లో ఫిజీలో 1583 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. 2025 తొలి ఆర్నెల్లలో 1226 కేసులు వెలుగు చూడటం గమనార్హం. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు కావటం గమనార్హం. దీనికి బ్లూటూత్ ట్రెండ్ కూడా కారణమంటున్నారు. హెచ్ఐవీ కేసులు పెరిగిపోవటానికి ఈ పాడు ట్రెండ్ కూడా ఒక ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.

డ్రగ్స్ కొనుక్కునేందుకు డబ్బులు లేని వాళ్లు.. అప్పటికే డ్రగ్స్ కిక్కులో మునిగితేలుతున్న వారి రక్తాన్ని తీసుకొని.. తమ ఒంట్లో ఎక్కించుకోవటమే ఈ బ్లూటూత్ ట్రెండ్ గా చెబుతున్నారు. ఎలా అయితే డేటాను ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి ఎలా అయితే బదిలీ చేస్తారో.. అదే రీతిలో ఈ మత్తును ట్రాన్సర్ చేస్తారని చెబుతున్నారు.

దీంతో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. అందమైన బీచ్ లు..కట్టి పడేసే నేచర్.. వావ్ అనిపించే రిసార్టులతో ఫిజీ పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. గత ఏడాది ఆ దేశంలో 9.86 లక్షల మంది పర్యాటకులు పర్యటించటం చూస్తే.. ఫిజీ క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతుంది. సో.. ఫిజీకి ప్లాన్ చేస్తే మాత్రం..కాస్తంత కేర్ ఫుల్ గా ఉండటం మంచిది.

Tags:    

Similar News