ఏపీలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం

ఇక ఏపీలో ఏర్పాటు కాబోతున్న క్వాంటం వ్యాలీ సువిశాలమైన ప్రాంగణంలో రూపుదిద్దుకోనుంది. దీని కోసం కూటమి ప్రభుత్వం ఏకంగా యాభై ఎకరాల భూమిని కేటాయించింది.;

Update: 2026-02-06 23:30 GMT

ఏపీ చరిత్రలో సరికొత్త అంకానికి తెర లేవనుంది. ముఖ్యంగా నూతన అధునాతన సాంకేతిక విప్లవానికి రంగం సిద్ధం అవుతోంది. దేశం అంతా ఏపీ వైపు చూసేలా ఒక వినూత్న ఆవిష్కరణ జరగబోతోంది. ఏపీకి ఇక తిరూలేదు అన్నట్లుగా ఒక మహా కార్యక్రమానికే నాంది కాబోతోంది. ఏపీ అభివృద్ధి ఇక మీద ఎవరూ ఊహించనంతగా దూసుకుని పోయే అవకాశాలు దీంతో సాకారం అవుతాయి. ఇంతకీ ఏమీలో ఏమి జరగుంది అంటే అతి పెద్ద సంచలనమే అని చెప్పాల్సి ఉంది.

క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన :

ఏపీలో క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఇది ఏకంగా భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రక ఘట్టానికి నాందిగా మారనుంది. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమంతో ఏపీ దేశంలోనే ప్రత్యేకంగా ప్రపంచంతో అనుసంధాం కానుంది. శనివారం జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యం సాకారం కానుంది. ఆ విధమైన భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకుని రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ఈ నెల 7న పునాదిరాయి పడుతోంది అంటే అంతా హర్షం వ్యక్తం చేసే శుభ తరుణం ఇది.

ఏపీ లీడర్ గా :

ఏపీలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీతో ఇక మీదట దేశానికే క్వాంటం టెక్నాలజీ రివల్యూషన్ విషయంలో ఏపీ లీడర్ గా మారబోతోంది అని నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో శంకుస్థాపన చేయబోతున్నారు.

సువిశాలమైన ప్రాంగణంలో :

ఇక ఏపీలో ఏర్పాటు కాబోతున్న క్వాంటం వ్యాలీ సువిశాలమైన ప్రాంగణంలో రూపుదిద్దుకోనుంది. దీని కోసం కూటమి ప్రభుత్వం ఏకంగా యాభై ఎకరాల భూమిని కేటాయించింది. ఇక శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు శుభ ఘడియలలో మొదలయ్యే ఈ శంకుస్థాపన ఘట్టం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏపీ దశ దిశ :

ఈ కీలక ప్రాజెక్ట్ తో ఏపీ దశ దిశ మారనుంది అని నిపుణులు చెబుతున్నారు. భారతదేశపు మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టి సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాలలో పరిశోధన, ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధికి అమరావతి వేదిక కాబోతోంది. అంతే కాదు ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్‌ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని శ్రీకారం చుట్టారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టం విస్తరణ, లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సాధ్యం కావాలన్నది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.

సామాన్యుడి జీవితంలోకి :

ఏపీలో రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ టెక్నాలజీతో సామాన్యుడి జీవితంలో పెను మార్పు వస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కావడం జరుగుతుంది. అలాగే వ్యాధుల నిర్ధారణ మెరుగుపడటంతో పాటు వ్యవసాయంలో వాతావరణ అంచనాలు, నీటి వినియోగం, దిగుబడి అంచనాలు కచ్చితత్వంతో ఉండడం, బ్యాంకింగ్-డిజిటల్ లావాదేవీల భద్రత పెరగడం వంటి అనేక ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందనున్నాయని చెబుతున్నారు. ఇక ఈ రోజు శంకుస్థాపన జరుపుకుంటున్న క్వాంటం వ్యలీ ఈ ఏడాది ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ భవనంగా సిద్ధం అవుతుంది అని అంటున్నారుజ్. ఇక ఇదే ఏడాది డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కాల పరిమితిని పెట్టుకుంది. ప్రపంచంలో చూస్తే సిలికాన్ వ్యాలీ ఐటీ విప్లవానికి నాయకత్వం వహించినట్లుగానే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలోని బోస్టన్ సింగపూర్, షాంఘై వంటి క్వాంటమ్ కేంద్రాలతో ధీటుగా సరి సమానంగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. అదే విధంగా ఫ్యూచర్ లో అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News