కేసులు పెట్టుకోమ‌న్న అంబ‌టి రాంబాబు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు. సీఎం చం ద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-02-07 03:26 GMT

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు. సీఎం చం ద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌పై గుంటూరు పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం.. ఆవెంట‌నే ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించ‌డంతో ప్ర‌స్తుతం రాజ‌మండ్రి జైల్లో రాంబాబు ఉన్నారు. వాస్త‌వానికి ఎన్ని కేసులు పెడ‌తారో.. పెట్టుకోండి.. జైల్లో పెడ‌తారా.. పెట్టుకోండి అంటూ రాంబాబు గ‌తంలో స‌వాల్ చేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. లేటెస్టుగా అంబ‌టి రాంబాబు యూట‌ర్న్ తీసుకున్నారు. త‌న‌పై పోలీసులు న‌మోదు చేసిన కేసుల‌ను కొట్టి(క్వాష్‌) వేయాల‌ని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇవ‌న్నీ రాజ‌కీయ దురుద్దేశంతో పెట్టిన కేసులేన‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో రాంబాబుపై.. గుంటూరు జిల్లా పట్టాభిపురం, మంగళగిరి, నగరంపాలెం, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప‌లు కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తం 7 కేసులు న‌మోద‌య్యాయి.

ఈ కేసుల‌ను కొట్టి వేయాల‌ని కోరుతూ.. అంబ‌టి రాంబాబు త‌ర‌ఫున ఆయ‌న న్యాయ‌వాది హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. సోమ‌వారం దీనిపై విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు. న‌ల్ల‌పాడు ప‌రిధిలో న‌మోదైన కేసును కూడా( ప్ర‌స్తుతం ఈ కేసులో అంబ‌టి జైలుకు వెళ్లారు)క్వాచ్ చేయాల‌ని కోరుతూ.. పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై ఈ నెల 11న విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో పోలీసులు నిష్ప‌క్ష పాతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోర్టు వారికి సూచించింది.

Tags:    

Similar News