రేవంత్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్టయింది: కవిత
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ ఎస్) అధ్యక్షురాలు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశా రు. ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) అధ్యక్షురాలు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశా రు. ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. తెలంగాణ సాధన కోసం.. ఉద్యమించిన వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడి రక్తాలు చిందేలా కొట్టారని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఉన్నది ప్రజలను వేధించేందుకా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజలసమస్యలు పరిష్కరించకపోగా.. ప్రజలపై పోలీసులను ప్రయోగించి అణిచేయడం దారుణమన్నారు.
బోడుప్పల్ లో భూములు కేటాయించాలని కోరుతూ.. పలువురు తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు. అయితే.. వీరిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు ఉద్యమకారులు గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన టీఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత.. స్పాట్‌కు చేరుకుని ఉద్యమకారులకు మద్దతు పలికారు. ఉద్యమకారులకు ఇస్తామన్న ఇంటి స్థలాలను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. స్థలాలు ఇవ్వకపోగా.. వారిపై లాఠీ చార్జి చేయడం సరికాదన్నారు.
కాగా.. కవితను బొల్లారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను బొల్లారం స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కవిత తెలిపారు. ఉద్యమకారులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తూ.. ఉన్నవారికి దోచిపెడుతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు.