ఇండియన్ ఆర్మీకి రూ. లక్ష కోట్ల బూస్ట్.. ఫుల్ పవర్స్‌.. చైనా, పాకిస్థాన్‌కు దేత్తడి పోచమ్మ గుడే..

బోర్డర్ అవతల కూర్చుని రోజూ ఏదో ఒక కుట్ర ప్లాన్ చేసే మన ప్రియమైన పొరుగు దేశాలు చైనా, పాకిస్థాన్‌లకు త్వరలోనే గట్టి 'సౌండ్' వినపడబోతోంది.

Update: 2026-07-02 17:30 GMT

బోర్డర్ అవతల కూర్చుని రోజూ ఏదో ఒక కుట్ర ప్లాన్ చేసే మన ప్రియమైన పొరుగు దేశాలు చైనా, పాకిస్థాన్‌లకు త్వరలోనే గట్టి 'సౌండ్' వినపడబోతోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మన డిఫెన్స్ రంగానికి ఏకంగా రూ. లక్ష కోట్ల భారీ బూస్ట్‌ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారి నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) త్వరలోనే ఈ లక్ష కోట్ల ఫైలుపై సంతకం పెట్టేందుకు సిద్ధమైంది. ఈ వార్త విన్నాక బీజింగ్, ఇస్లామాబాద్‌లలో కొందరికి బీపీలు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

ఈ భారీ ప్యాకేజీలో అసలైన 'ట్విస్ట్' ఏంటంటే.. ఇందులో సింహభాగం మన ఇండియన్ ఆర్మీకే దక్కబోతోంది. ఇకపై సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి ఏకంగా 300 అదనపు 'కే-9 వజ్ర' స్వయం చోదక శతఘ్నులను రంగంలోకి దించుతున్నారు. పోనీ ఇవి ఎక్కడో విదేశాల నుంచి కొంటున్నారా అంటే అదీ లేదు.. పక్కా 'మేక్ ఇన్ ఇండియా' బ్రాండ్! అంటే మనవాళ్లే తయారు చేసి, మన సరిహద్దుల్లో పెట్టి, శత్రువుల వైపు గురిపెడతారన్నమాట.

డ్రోన్ల 'డ్రామా'లకు చెక్.. గాల్లోనే ఖేల్ ఖతం!

ఉక్రెయిన్-రష్యా యుద్ధం చూశాక మనవాళ్లకు ఒక విషయం బాగా అర్థమైంది.. కాలం మారింది.. యుద్ధాలూ మారాయి. అందుకే, శత్రువుల అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లి మరీ పేలిపోయే ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఈసారి భారీగా కొంటున్నారు. అంటే అవతలి వాడు డ్రోన్లతో ఏదో చేద్దామని ప్లాన్ చేస్తే.. మన డ్రోన్లు వెళ్లి వాళ్ల ప్లాన్లను గాల్లోనే కలిపేస్తాయన్నమాట.

అంతేకాదు గాల్లో ఎగిరే శత్రు విమానాలు, హెలికాప్టర్లను పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయడానికి రష్యాకు చెందిన అత్యాధునిక 'వెర్బా' మ్యాన్‌ప్యాడ్స్ కూడా వస్తున్నాయి. మన యుద్ధ ట్యాంకులకు చిన్న గీత కూడా పడకుండా కాపాడే 'యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్' (ఏపీఎస్) కూడా లైన్లో ఉన్నాయి. ఇక చైనా బోర్డర్‌లో మన ట్యాంకులను టచ్ చేయాలన్నా శత్రువు వందసార్లు ఆలోచించుకోవాల్సిందే.

గగన తలంలో గర్జన.. సముద్ర గర్భంలో గాలం

ఆర్మీకి ఇంత ఇస్తుంటే వైమానిక దళం (ఐఏఎఫ్), నౌకాదళం ఊరుకుంటాయా? వాళ్లకు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. ఎయిర్ ఫోర్స్ కోసం గాల్లోనే యుద్ధ విమానాలకు పెట్రోల్ కొట్టే ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయెలింగ్ విమానాలు, సుదూర లక్ష్యాలను లేపేసే లాంగ్-రేంజ్ మిస్సైళ్లు, సరిహద్దుల్లో ఈగ వాలినా కనిపెట్టే అత్యాధునిక రాడార్ వ్యవస్థలు వస్తున్నాయి.

నేవీ కోసం సముద్రం కింద దాక్కుని ఏవైనా నక్క వినయాలు ప్రదర్శిస్తే పట్టుకోవడానికి అండర్‌వాటర్ డ్రోన్లు, భారీ టార్పెడోలు, మనుషులు లేని అత్యాధునిక నౌకలను రంగంలోకి దించుతున్నారు.

గాల్వాన్ లో చైనా వేసిన వేషాలు, పహల్గామ్ ఉగ్రదాడుల లాంటి ఘటనల తర్వాత భారత్ రూట్ మార్చింది. "మీరు మారకపోతే.. మేము ఆయుధాలు మారుస్తాం" అన్న రేంజ్‌లో రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంచుకుంటూ పోతోంది. మొత్తానికి ఈ లక్ష కోట్ల బూస్ట్‌తో మన సైన్యానికి ఫుల్ పవర్స్ రాబోతున్నాయి.. ఇకపై మన సరిహద్దుల వైపు కన్నెత్తి చూస్తే.. శత్రువులకు 'దేత్తడి పోచమ్మ గుడే' అని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ గట్టిగానే హింట్‌ ఇస్తున్నారు.

Tags:    

Similar News