చైనాలో విస్తరిస్తోన్న కొత్త అంటు రోగం... ఏమిటీ స్పై-క్యామ్ పో*ర్న్!
హోటల్ సిబ్బంది తనిఖీలకు మించిన కెమెరాలు ఆ గదుల్లో రహస్యంగా ఉంటున్నాయని.. ఫలితంగా హోటల్లో శృంగారంలో పాల్గొన్న జంటల వీడియోలు తక్షణం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు.;
గత కొంతకాలంగా చైనాలో ఓ కొత్త అంటు రోగం విసరిస్తోందనే విషయం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా... ఆ దేశంలో పోర్న్ వీడియోలు సృష్టించడం, షేర్ చేయడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ.. "స్పై-క్యామ్ పోర్న్" అనే అవలక్షణం మాత్రం విస్తరిస్తూనే ఉంది. పైగా గత కొంతకాలంగా ఈ విషయంలో సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. దీని బారిన పడిన బాధితుల సంఖ్యకు కొదవ లేకుండా పోతుందని చెబుతున్నారు.
అవును... స్పై-క్యామ్ పోర్న్ అనేది ఇప్పుడు చైనాలో మరింతగా వ్యాపిస్తుందని అంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నా, ఆ దేశంలో ఈ సమస్యకు మాత్రం మందు దొరకడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య పరిష్కారానికి గత ఏప్రిల్ లోనే ప్రభుత్వం కొన్ని రూల్స్ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా.. చెక్ ఇన్ చేసే సమయంలో గదిని గెస్ట్ సంతృప్తి చెందేలా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపింది! అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని అంటున్నారు.
హోటల్ సిబ్బంది తనిఖీలకు మించిన కెమెరాలు ఆ గదుల్లో రహస్యంగా ఉంటున్నాయని.. ఫలితంగా హోటల్లో శృంగారంలో పాల్గొన్న జంటల వీడియోలు తక్షణం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో హోటల్ గదుల్లో కంటికి కనిపించీ కనిపించని స్థాయిలో ఉన్నట్లుగా ఉండే చిన్న చిన్న కెమెరాలను ఎలా గుర్తించాలో.. చాలామంది మహిళలు సోషల్ మీడియా వేదికగా చిట్కాలు పంచుకుంటూ, ఈ విషయంలో వారి వారి అనుభవాలను వెల్లడిస్తున్నారు.
ఇలా హోటల్ గదుల్లో రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను సాధారణంగా మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ లలో ప్రచారం చేయబడుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో టెలీగ్రామ్ లో ప్రమోట్ చేయబడిన పలు వెబ్ సైట్స్ లోనూ ఈ వీడియోలను కనుగొన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 180కంటే ఎక్కువ హోటల్ గది స్పై క్యామ్ లను నిర్వహిస్తున్నాయని.. ఇవి అతిథుల కార్యకలాపాలను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నాయని చెబుతున్నారు!
ఈ క్రమంలో... ఈ తరహా వీడియోలను ప్రసారం చేసే ఓ టెలీగ్రామ్ ఛానల్ లో సుమారు 10,000కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటె... చైనాలో స్పై క్యామ్ లను అమ్మడం, ఉపయోగించడంపై కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ... దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అయిన హువాకియాంగ్ బీలో ఒకదాన్ని కొనుగోలు చేయడం చాలా సులభమని చెబుతున్నారు. దీంతో.. ఈ అంటు రోగం మరింత విస్తరిస్తుందని అంటున్నారు.