• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Technology >  AI హడావుడి.. సినిమాకు...

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

| సినిమా పాటల్లో AI వాయిస్‌ల ప్రయోగాలు మ్యూజిక్ డైరెక్టర్లకు కొత్త ట్రెండ్‌గా మారాయి. అయితే 'మాస్ జాతర', 'లవ్ మీ' వంటి సినిమాల్లో ఈ ప్రయోగాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. 'వేట్టయన్'లో 'మనసిలాయో' మాత్రం హిట్ అయింది. తాజాగా బాలకృష్ణ 'దాదా ధమాకా' పాటలోనూ AI వాడారనే ప్రచారం జరుగుతోంది. పాటకు మాత్రం ఆశించిన స్పందన రాలేదు.

By - M Prashanth
Update: 2026-11-19 17:30 GMT

సినిమా పాటల్లో AI ప్రయోగాలు చేయడం ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్లకు కొత్త ట్రెండ్‌గా మారుతోంది. దివంగత గాయకుల గొంతులను మళ్ళీ తీసుకురావడం, స్టార్ హీరోల వాయిస్‌లను మార్చడం వంటి ప్రయత్నాలతో మంచి పబ్లిసిటీ సంపాదిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించిన సినిమాలకు ఇప్పటివరకు ఎంత ప్రయోజనం కలిగిందనేది చూస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా తెలుగులో AI పాటలతో హడావుడి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి.

రవితేజ 'మాస్ జాతర'లో చక్రి వాయిస్‌ను AIతో తిరిగి తీసుకొచ్చారు. 'తు మేరా లవర్' పాటకు చక్రి గొంతు ఉపయోగించారనే విషయం అప్పట్లో మంచి ప్రచారం తెచ్చింది. కానీ సినిమా విడుదలయ్యాక ఆ ప్రయోగం పెద్దగా ఉపయోగపడలేదు. బాక్సాఫీస్ వద్ద 'మాస్ జాతర' దెబ్బతింది. అంతకుముందు కీరవాణి కూడా 'లవ్ మీ'లోని 'ఘోస్ట్ లవ్' పాట కోసం AI ఉపయోగించారు. ఆస్కార్ విన్నర్ చేసిన ప్రయోగం అంటూ చెప్పుకున్నా, ఆ సినిమా మ్యూజిక్ కూడా పెద్దగా క్లిక్ కాలేదు.

అయితే అనిరుధ్ మాత్రం 'వేట్టయన్'లోని 'మనసిలాయో'తో మంచి హిట్ అందించారు. మలేషియా వాసుదేవన్ గొంతును AIతో తీసుకొచ్చిన ఆ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ అక్కడ AI ఒక్కటే పనిచేయలేదు. అనిరుధ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, రజనీకాంత్, మంజు వారియర్ డ్యాన్స్ స్టెప్పులు పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా రీల్స్‌లో ఆ స్టెప్పులకు మంచి క్రేజ్ వచ్చింది. అయినప్పటికీ 'వేట్టయన్' సినిమా బిజినెస్ పరంగా అంచనాలను అందుకోలేకపోయింది.

నిజానికి ఇప్పుడు AIతో పాట రూపొందించారనే విషయాన్నే మేకర్స్ ఒక ప్రమోషన్ పాయింట్‌గా మార్చుకుంటున్నారు. దాంతో విడుదల సమయంలో సోషల్ మీడియాలో కొంత బజ్ వస్తోంది. కానీ పాటను మళ్లీ మళ్లీ వినేలా చేయడం మాత్రం అంత ఈజీ కావడం లేదు. ముఖ్యంగా పాత గాయకుల వాయిస్‌లు ఉపయోగించినప్పుడు వాళ్ల ఒరిజినల్ పాటలతో పోలికలు కూడా వస్తున్నాయి. పైగా AIతో సృష్టించిన గొంతు కోసం ప్రత్యేకంగా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు ఎంతమంది ఉంటారనేది కూడా సందేహమే.

ఇప్పుడు బాలకృష్ణ 'దాదా ధమాకా' పాటలోనూ AI ఉపయోగించారనే టాక్ వినిపిస్తోంది. తమన్ మరో సింగర్‌తో పాడించి బాలయ్య గొంతులా మార్చారనే ప్రచారం ఉన్నప్పటికీ అధికారికంగా క్లారిటీ రాలేదు. అయితే పాట విడుదలైన తర్వాత తమన్ ట్యూన్‌పై విమర్శలు వచ్చాయి. బాలయ్య స్వయంగా పాడారనే ప్రచారం ఉన్నా పాటకు ఆశించిన స్పందన దక్కలేదు. డిసెంబర్ 24న 'దాదా' విడుదలకు సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నర్గీస్ ఫక్రీతో బాలయ్య చేసిన స్పెషల్ సాంగ్ ఇదే. ఇక సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
  • aisongs 
  • telugucinema 
  • aivoice 
  • aitechnology 
  • massjathara 

Similar News

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

చిన్న సైజులో ఎలక్ట్రిక్ డిఫెండర్.. 2027లో రాక!

2026-11-19 03:06 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

చైనాకు చెక్: AI సప్ల‌య్ చైన్ ర‌క్ష‌ణ‌కు భార‌త్ స‌హా 9 దేశాల ఒప్పందం!

2026-11-16 19:30 GMT

దంపతుల మధ్య చిచ్చు పెట్టిన ChatGPT.. విడాకుల వరకు వెళ్లిన గొడవ!

2026-11-16 12:30 GMT

పుస్తకాలతో కుస్తీ లేదు.. ఏఐతో మస్తి.. టాపర్‌గా మారిన చీటర్ కథ

2026-11-16 08:11 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

భార్యకు ద్రోహం చేశా.. NVIDIA ఉద్యోగులకు CEO జెన్సన్ హువాంగ్ క్షమాపణలు!

2026-11-09 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS