• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'కాక్రోచ్ జనతా పార్టీ'...

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

| నీట్ వివాదంతో వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో అరెస్టులు, కోర్టు ఆంక్షల నేపథ్యంలో నిరసనలకు విరామం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. అయితే మహారాష్ట్ర, యూపీ సహా పది రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటు, హర్యానా, కేరళలో కార్యక్రమాలతో రాష్ట్రాల స్థాయిలో విస్తరణపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి దేశవ్యాప్త ఉద్యమం వైపు సీజేపీ వ్యూహం మార్చుకుందా అన్న ఆసక్తి నెలకొంది.

By - Tupaki Political Desk
Update: 2026-11-19 13:30 GMT

నీట్ పేపర్ లీకేజీ ఉదంతంపై ఉద్యమించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, కేంద్ర విద్యామంత్రి రాజీనామాకు కారణమైన జెన్-జీ యువత సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)లో స్తబ్దత నెలకొందా? సీజేఐ సూర్యకాంత్ చేసిన ఒకే ఒక వ్యాఖ్యను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా తుఫానులా పుట్టుకొచ్చిన సీజేపీ రెండు భారీ పోరాటాల తర్వాత అకస్మాత్తుగా మౌనం దాల్చడంపై ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉక్కుపాదం, అరెస్టులు, కోర్టు ఆంక్షల నేపథ్యంలో సీజేపీ వెనక్కి తగ్గిందా? లేక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోందా అన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ పేరిట ఓటర్ల జాబితా నుండి లక్షలాది పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ గత నెలలో ఢిల్లీ వేదికగా భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే, ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డీ-నోటిఫై చేస్తూ కఠిన ఆంక్షలు విధించారు. అక్టోబర్ 13న ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి అక్కడ నిరసనకు దిగిన సీజేపీ ముఖ్య నేతలు సౌరభ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్యా షిండేను పోలీసులు అరెస్టు చేశారు. అజింక్యా షిండేను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయగా, సౌరభ్ దాస్, అశుతోష్ రంకాను జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం తిహార్ జైలుకు తరలించారు. అనంతరం, అక్టోబర్ 21న షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత సీజేపీ నేతలు ఢిల్లీలో కనిపించలేదని అంటున్నారు.

ఒకవైపు పోలీసుల నిర్బంధం కొనసాగుతుండగానే, మరోవైపు సీజేపీకి న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో నిరసనల కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించారా? అనే చర్చ జరుగుతోంది. దీపావళి, ఇతర పండుగల సీజన్‌లో సెంట్రల్ ఢిల్లీ, జంతర్ మంతర్, రాంలీలా మైదాన్ పరిసరాల్లో జరుగుతున్న ఆందోళనల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిని రోజుకు కోట్లాది రూపాయలు నష్టపోతున్నామని ఢిల్లీ కిరాణా కమిటీ, వ్యాపార సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, సవరించిన పిటిషన్‌ను రికార్డులోకి తీసుకుంటూ నవంబర్ 18న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు సీజేపీకి నోటీసులు జారీ చేసింది. నిరసన తెలిపే హక్కుతో పాటు సామాన్యులు, వ్యాపారుల జీవనోపాధి హక్కులను కూడా సమతుల్యం చేయాల్సి ఉందని పేర్కొన్న ధర్మాసనం, తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది.

సోషల్ మీడియాలో కనిపించని హడావుడి.. కారణమిదే!

ప్రారంభంలో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (X) వేదికలపై మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దూసుకుపోయిన సీజేపీ, ఇప్పుడు డిజిటల్ వేదికలపై పెద్దగా కనిపించకపోవడం చర్చకు తావిస్తోంది. ప్రభుత్వ చట్టపరమైన అభ్యర్థనల మేరకు భారత్‌లో సీజేపీ అధికారిక 'ఎక్స్' ఖాతాపై ఆంక్షలు విధించారు. అదేవిధంగా వెబ్‌సైట్‌ను నిలిపివేయడం వల్ల సోషల్ మీడియాలో పార్టీ గొంతుకకు అడ్డుకట్ట పడింది. దీనికి తోడు, పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నవంబర్ 20న భారీ నిరసనకు పిలుపునిస్తున్నట్లు ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో పూర్తిగా 'ఏఐ ఫేక్' అని ఫ్యాక్ట్-చెక్ సంస్థలు తేల్చడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో సీజేపీ సోషల్ మీడియా అకౌంట్లలో వచ్చే సమాచారంపై గందరగోళం నెలకొందని, అందుకే రీచ్ తగ్గిందన్న విశ్లేషణలు చేస్తున్నారు.

ఢిల్లీ నుంచి రాష్ట్రాల వైపు!

ఢిల్లీలో నిర్బంధాలు, కోర్టు కేసుల నేపథ్యంలో సీజేపీ తన ఉద్యమ పంథాను మార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ కేంద్రీకృత ఆందోళనల స్థానంలో రాష్ట్రాల వారీగా క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం వైపు అడుగులు వేస్తోందని చెబుతున్నారు. సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే జైలు నుంచి విడుదలయ్యాక ఢిల్లీలో నేరుగా పోలీసులతో ఘర్షణ పడే బదులు దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే పనిలో పడ్డారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో కోఆర్డినేషన్ కమిటీలను ప్రకటించి సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించినట్లు అభిప్రాయపడుతున్నారు. ఇదేసమయంలో జైలు నుండి బయటకు వచ్చిన జాతీయ సహ-కన్వీనర్ అశుతోష్ రంకా హర్యానా రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని ఎండగడుతూ ఈ నెల 17న 'స్కూల్ ఠీక్ కరో' యాత్రను ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో కేరళలోని కొచ్చి వేదికగా "జంతర్ మంతర్ ఎట్ కొచ్చి" పేరిట ఓటర్ల తొలగింపునకు వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన చేపట్టారు. వీటిని గమనిస్తే సీజేపీ తన కార్యక్రమాలను ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచనలో ఉందని అంటున్నారు.

Tags:    
  • cockroachjanataparty 
  • cjp 
  • genzpolitics 
  • neetprotest 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS