• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ...

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

| భారత్ మండపంలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధాని మోదీ పొదుపు సంస్కృతిని ప్రోత్సహించాలని సూచించారు. 2011–2023 మధ్య 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంటూ, వారు మళ్లీ పేదరికంలోకి వెళ్లకుండా ఆర్థిక క్రమశిక్షణ అవసరమన్నారు. డ్రగ్స్, నక్సలిజం, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-19 14:30 GMT

దేశ ఆర్థిక ప్రగతి, పౌరుల జీవన ప్రమాణాల పెరుగుదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తినడం, తాగడం, మజా చేయడం’ (ఖావో, పీయో ఔర్ మౌజ్ కరో) అనేది భారతీయ సంస్కృతి కాదని, పొదుపు చేయడం భారతీయుల సహజ లక్షణమని ఆయన స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సు ముగించుకుని తిరిగి వచ్చిన ప్రధాని కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ భేటీ సుమారు మూడున్నర గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా దేశంలో పేదరిక నిర్మూలన, ఆర్థిక క్రమశిక్షణ, అంతర్గత భద్రతపై మంత్రులు, ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

మళ్లీ పేదరికంలోకి వెళ్లకూడదు

2011 నుంచి 2023 మధ్యకాలంలో దేశంలో దాదాపు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రభుత్వ కృషి, అధికారుల పనితీరు, పరిశ్రమలు, ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పేదరికాన్ని తగ్గించిన దేశంగా భారత్ రికార్డు సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భాన్ని ఒక జాతీయ వేడుకగా జరుపుకోవాల్సివుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. 2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో తాను చేసిన తొలి ప్రసంగంలో ‘పేదలకు అంకితమైన ప్రభుత్వం’గా పనిచేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే పురోగతి సాధ్యమైందని తెలిపారు. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం కేవలం మొదటి అడుగు మాత్రమేనని, వారు ఆర్థిక క్రమశిక్షణ తప్పి అనవసర ఖర్చులకు అలవాటు పడితే మళ్లీ పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

పొదుపు సంస్కృతిని ప్రోత్సహించాలి

మారిన జీవనశైలి నేపథ్యంలో విచ్చలవిడి ఖర్చుల సంస్కృతి పెరగడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ సమాజం ఎల్లప్పుడూ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడానికే ప్రాధాన్యమిస్తుందని, ఆ మూల సూత్రాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. సామాన్య ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత, పొదుపు ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబ స్థాయిలో పెరిగే పొదుపు అలవాటు కేవలం వారి వ్యక్తిగత ఆర్థిక భద్రతకే కాకుండా, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడుల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఎంతో దోహదపడుతుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

మాదకద్రవ్యాలు, నక్సలిజంపై అప్రమత్తత

ఈ సమావేశంలో ఆర్థిక అంశాలతో పాటు దేశ యువత భవిష్యత్తుకు సవాలుగా మారిన మాదకద్రవ్యాల (డ్రగ్స్) సమస్యపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువతను డ్రగ్స్ ఉచ్చు నుంచి కాపాడాలని చెబుతూ ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారని, ఆయన గొంతు జీరబోయిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టడంలో విజయం సాధించినట్లే, డ్రగ్స్ మహమ్మారిని కూడా సమూలంగా నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ‘నక్సల్ రహిత భారత్’ సాధనలో సాధించిన విజయాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. సాధించిన విజయాలతో అలసత్వం ప్రదర్శించకుండా, నక్సలిజం మళ్లీ తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలను అరికట్టడంపై దృష్టి సారించాలని ప్రధాని స్పష్టం చేశారు.

Tags:    
  • pmmodi 
  • indiansavings 
  • povertyreduction 
  • drugfreeindia 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS