• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Tamil Nadu >  స్టాలిన్‌ను ఓడించిన...

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

| తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నుంచి మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను 8,795 ఓట్లతో ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారు. గతంలో డీఎంకేలో పనిచేసిన బాబు, 2006లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-19 12:31 GMT

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను ఆయన కంచుకోట కొలత్తూరు నియోజకవర్గంలో ఓడించి సంచలనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో సెప్టెంబర్ 9న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 2.24 గంటలకు కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారు.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే తరఫున కొలత్తూరు నుంచి బరిలోకి దిగిన వీఎస్ బాబు, తన ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ, ఫలితాల వేళ కూడా స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్‌ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తరచూ వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు స్టాలిన్ గెలుపు కోసం పనిచేసిన నేత, ఆ తర్వాత అదే నియోజకవర్గంలో ఆయన్ను ఓడించడం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మలుపుగా నిలిచింది.

కొలత్తూరులో 2026లో గెలిచినప్పటికీ, వీఎస్ బాబుకు ఎమ్మెల్యేగా పనిచేయడం ఇది తొలిసారి కాదు. డీఎంకేలో సాధారణ ఏరియా కార్యదర్శిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వీఎస్ బాబు ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి పురసవాక్కం నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పురసవాక్కం నియోజకవర్గం రద్దయింది. నియోజకవర్గంలో మెజార్టీ ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన కొలత్తూరు నియోజకవర్గంలో కలిశాయి. 2011 ఎన్నికల్లో కొలత్తూరులో స్టాలిన్ గెలవడంలో బాబు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, 2016లో అన్నాడీఎంకేలో చేరారు. అనంతరం 2026లో టీవీకేలో చేరి కొలత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కొలత్తూరులో నాటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి 'జెయింట్ కిల్లర్'గా నిలిచిన వీఎస్ బాబుకు సీఎం విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. అయితే వయోభారం, అనారోగ్య సమస్యలు ఆయనకు శాపంగా మారినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్ లో ఎక్కువగా కొత్తవారికే అవకాశాలు ఇవ్వడం కూడా వీఎస్ బాబుకు చాన్స్ రాకుండా చేసిందని అంటున్నారు. అయితే, మంత్రి పదవి లేకపోయినా మాజీ సీఎం స్టాలిన్ ను ఓడించిన నేతగా తమిళ రాజకీయాల్లో కొత్త రికార్డును నమోదు చేశారు. ఈ నియోజకవర్గంలో స్టాలిన్ సగటున 70 వేల ఆధిక్యంతో గెలిచేవారు. అయితే గత ఎన్నికల్లో స్టాలిన్ బాబుపై సుమారు 8 వేల ఓట్ల ఆధిక్యం సాధించి మాజీ ముఖ్యమంత్రికి ఝలక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో గడపగడపకు తిరిగిన బాబు ఓటర్లతో ఉన్న పాత పరిచయాలు ఉపయోగించుకుని సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న ఆయన విధి చేతిలో ఓడిపోయారని అభిమానులు కన్నీరు పెడుతున్నారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన ఆనందం ఎన్నాళ్లు నిలవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • vsbabu 
  • tvk 
  • mkstalin 
  • tamilnadupolitics 
  • vijay 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

హైటెక్ దొంగతనం.. కొత్త జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన యూట్యూబర్!

2026-11-15 19:28 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజీవ్ కి ద్రోహం చేశానా...సోనియా షాకింగ్ కామెంట్స్ !

2026-11-12 02:16 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆరాటం.. ఆర్టీఐతో పోరాటం..ఇదో సాధారణ బ్రేకప్ స్టోరీ కాదు సామీ

2026-11-07 14:05 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

Copyright @2026

Powered by Blink CMS