• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Tamil Nadu >  విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ...

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

| తమిళనాడు సీఎం విజయ్ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 61.84 లక్షల మంది విద్యార్థులకు కేక్ ప్యాకెట్లు, గ్రీటింగ్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.9.27 కోట్లు కేటాయించింది. పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చేరువయ్యే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-13 04:43 GMT

తమిళనాడులో ఈ సారి బాలల దినోత్సవ వేడుకలు అపూర్వ రీతిలో నిర్వహించనున్నారు. సాధారణంగా చిల్డ్రన్స్ డే అనగానే పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, చాక్లెట్లు, అరకొర బహుమతులతో సరిపెట్టడం మనం చూస్తుంటాం. ఇవన్నీ ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తూతూ మంత్రంగానే బాలల దినోత్సవం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చొరవతో బాలల దినోత్సవం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధురానుభూతిగా మిగిలిపోనుంది. ఈ నవంబరు 14న తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేయాలని సీఎం విజయ్ నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 61.84 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీరందరికీ కేకులు, గ్రీటింగ్ కార్డులతో ఉన్న ప్రత్యేక గిఫ్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ సరికొత్త కార్యక్రమం కోసం తమిళనాడు ప్రభుత్వం సుమారు రూ. 9.27 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. విద్యార్థులందరికీ పంపిణీ చేసేందుకు వీలుగా మొత్తం 61,84,566 కేక్ ప్యాకెట్లను ఇప్పటికే సిద్ధం చేశారని చెబుతున్నారు. సేలం, ఈరోడ్ సహా మొత్తం 12 జిల్లాల్లో విద్యార్థులకు రెండు కేక్ ప్యాకెట్ల చొప్పున (మొత్తం 45 గ్రాములు) పంపిణీ చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఒక్కో విద్యార్థికి 45 గ్రాముల కేక్ ప్యాకెట్‌తో పాటు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సంతకం చేసిన ప్రత్యేక గ్రీటింగ్ కార్డును అందిస్తున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం తొలిసారిగా చెబుతున్నారు. ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు.

రాజకీయ ప్రయోజనమేనా..

చిన్నారులతో 'మామ' అని పిలిపించుకోడానికి ఇష్టపడే ముఖ్యమంత్రి విజయ్ దీర్ఘకాల రాజకీయ వ్యూహంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా యువతకు దగ్గరై వారి ద్వారా పెద్దల ఓట్లు కూడా కొల్లగొట్టిన విజయ్.. నేటి యువతే రేపటి భవిష్యత్తు అనే సూక్తిని తన రాజకీయ ప్రయోజనం కోసం పక్కాగా వినియోగింకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. పిల్లల ద్వారా వారి తల్లిదండ్రులకు చేరువ అవడం, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నారనే ఫీల్ గుడ్ భావన పెంచుకోవాలనే ఉద్దేశం ఇందులో భాగంగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగానూ ఇది ఒక సరికొత్త మాస్టర్ స్ట్రాటజీగా మారుతోందని, భావి భారత పౌరులైన చిన్నారులతో నేరుగా మధురమైన జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా సీఎం విజయ్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారని మీడియా విశ్లేషిస్తోంది.

ఇక గిఫ్ట్ లు పంపిణీలో ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. తమిళనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ తయారీదారుల నుంచి ఈ కేక్‌లను సేకరించి, జిల్లాలకు తరలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక నిఘా పెట్టింది. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక విజిలెన్స్ బృందాలు ఈ పంపిణీ ప్రక్రియను ఎంతో పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాయి. మొత్తానికి, తమిళనాడులో నవంబర్ 14 బాలల దినోత్సవం అంటే కేవలం ఒక సెలవుదినం లేదా సాధారణ వేడుక మాత్రమే కాకుండా, చిన్నారులకు నోరూరించే తీపి జ్ఞాపకాన్ని అందించే చారిత్రాత్మక ద్వారా మారిపోయిందని విశ్లేషిస్తున్నారు.

Tags:    
  • tamilnadu 
  • cmvijay 
  • childrensday 
  • governmentschools 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

హైటెక్ దొంగతనం.. కొత్త జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన యూట్యూబర్!

2026-11-15 19:28 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజీవ్ కి ద్రోహం చేశానా...సోనియా షాకింగ్ కామెంట్స్ !

2026-11-12 02:16 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆరాటం.. ఆర్టీఐతో పోరాటం..ఇదో సాధారణ బ్రేకప్ స్టోరీ కాదు సామీ

2026-11-07 14:05 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

Copyright @2026

Powered by Blink CMS