• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Tamil Nadu >  చంద్రబాబు దెబ్బకు...

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

| ఏపీకి రూ.1,614 కోట్ల పెట్టుబడులు తరలిపోవడంతో తమిళనాడు పరిశ్రమల శాఖలో 15 మంది అధికారులను తొలగించారనే ప్రచారం కలకలం రేపుతోంది. హ్వేసింగ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో డేటా లీక్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే 15 మంది ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

By - Tupaki Desk
Update: 2026-11-19 15:30 GMT

ఏపీ, తెలంగాణ మధ్య పారిశ్రామిక పెట్టుబడుల పోటీ కొత్త మలుపు తిరిగింది. పెట్టుబడిదారుల డేటాను లీక్ చేశారన్న కారణంతో తమిళనాడు ప్రభుత్వం 15 మంది అధికారులపై వేటు వేసిందనే ప్రచారం సంచలనం సృష్టిస్తోంది. అధికారికంగా ఈ ప్రచారాన్ని ఎవరూ నిర్ధారించక పోయినా మీడియా సర్కిల్స్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. తమిళనాడు పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల సమాచారాన్ని ఏపీకి చేరవేస్తున్నారని, ఫలితంగా ఇటీవల రూ.1,614 కోట్ల విలువైన పెట్టుబడులు ఏపీకి తరలిపోయాయని అంటున్నారు. దీనికి బాధ్యులుగా 15 మందిని గుర్తించి వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని తమిళనాడు పరిశ్రమలశాఖ అధికారులు కొట్టి పడేస్తున్నారు.

ఏపీలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొందరు పారిశ్రామిక వేత్తలు ఒప్పందం కుదుర్చు కున్నారు. ఇందులో ప్రధానంగా కొరియన్ ఫుట్ వేర్ దిగ్గజం హ్వేసింగ్ రూ.898 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో యూనిట్ పెట్టాలని నిర్ణయించింది. అదేవిధంగా తిరుపతి జిల్లా సత్యవేడులో రూ.2,200 కోట్లతో రాయల్ ఎన్ ఫీల్డ్, అనంతపురం జిల్లాలో మరికొన్ని పరిశ్రమలు పెడుతున్నారని చెబుతున్నారు. ఇవన్నీ తమిళనాడు ప్రభుత్వంతో ముందుగా సంప్రదింపులు జరిపినవేనని అంటున్నారు.

తమిళనాడు రాష్ట్రానికి వస్తాయని భావించిన పెట్టుబడులు ఏపీకి తరలిపోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడిందని అంటున్నారు. తమతో సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుండగానే, ఏపీ ప్రభుత్వంతో సదరు సంస్థలు ఒప్పందం చేసుకోవడాన్ని తమిళనాడు ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేక పోయారని అంటున్నారు. దీనిపై ఆరా తీయగా, పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న 15 మంది డేటా లీక్ చేశారన్న విషయం బయటపడిందని, దీంతో వారిపై వేటు వేశారని చెబుతున్నారు. అయితే ఇలా బయటకు వెళ్లినవారు వెంటనే ఏపీ ప్రభుత్వంలో చేరినట్లు జరుగుతున్న ప్రచారం మరింత వేడి పుట్టిస్తోందని అంటున్నారు.

అయితే ఇదంతా కల్పిత ప్రచారమేనని, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అపోహలు సృష్టించేందుకు చేస్తున్న ప్రచారంగా పరిశీలకులు అనుమానిస్తున్నారు. తమిళనాడు పరిశ్రమల విభాగంలో 15 మందిని తొలగించినట్లు అధికారిక ప్రకటన ఎక్కడా రాలేదని అంటున్నారు. కేవలం సోషల్ మీడియా వర్సిటీలో పుట్టిన అసత్య కథనమనే భావనను వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం వరుసగా కీలక ప్రాజెక్టులు కోల్పోవడం నిజమే అయినప్పటికీ ఏపీ ప్రభుత్వ దూకుడు, పెట్టుబడి దారులను ఆకర్షించేలా రాయితీలు ప్రకటించడమే ఇందుకారణంగా భావిస్తున్నారు. సమైక్య దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని మరో రాష్ట్ర ప్రభుత్వం సేకరించేందుకు ఎలాంటి అవకాశం, అవసరం లేదని అంటున్నారు.

Tags:    
  • andhrapradesh 
  • tamilnadu 
  • industrialinvestments 
  • dataleak 
  • chandrababu 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

హైటెక్ దొంగతనం.. కొత్త జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన యూట్యూబర్!

2026-11-15 19:28 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజీవ్ కి ద్రోహం చేశానా...సోనియా షాకింగ్ కామెంట్స్ !

2026-11-12 02:16 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆరాటం.. ఆర్టీఐతో పోరాటం..ఇదో సాధారణ బ్రేకప్ స్టోరీ కాదు సామీ

2026-11-07 14:05 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

Copyright @2026

Powered by Blink CMS