• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎమ్మెల్యేలతో సీఎం విజయ్...

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

| తమిళనాడులో ఇద్దరు టీవీకే ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఎం విజయ్ బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ ఓ ఫొటోగ్రాఫర్‌పై దాడి చేశారనే ఆరోపణలు, ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు పంపారనే వార్తలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా అనే ఆసక్తి నెలకొంది.

By - Tupaki Political Desk
Update: 2026-11-10 12:56 GMT

తమిళనాడులో అధికార టీవీకే ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి దళపతి విజయ్ సమావేశం కానున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ అత్యంత సాధారణంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి వ్యవహారశైలి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చెబుతున్నారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ రవిశంకర్, ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ ఒక మహిళా కలెక్టర్ కు అసభ్య సందేశాలు పంపారని కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని అంటున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలపై ఒకేసారి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలోకి వెళ్లిపోయింది. ఆ ఆరోపణలు తిప్పికొట్టడంలోనూ పార్టీ యంత్రాంగం విఫలమైందని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ తన నియోజకవర్గంలోని తాగునీటి సమస్య చెప్పిన ఒక ఫొటో గ్రాఫర్ పై దాడి చేశారు. తాను విజయ్ అభిమానిని అంటూ బాధితుడు చెబుతున్నప్పటికీ డిప్యూటీ స్పీకర్ కనికరించలేదు. ప్రజాప్రతినిధిని అన్న విషయాన్ని మరచిపోయి పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి దిగారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.

అదేవిధంగా ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ కళ్లకురిచి జిల్లా కలెక్టర్ కి అసభ్య మెసేజ్ లు పంపారనే ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మాజీ గవర్నర్ తమిళసై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. అయితే తాను ఎలాంటి మెసేజ్లు పంపలేదని ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం రాజకీయంగా పార్టీకి నష్టం చేసినదిగా సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. తమ ఎమ్మెల్యేలు అనవసర వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయనే ఆలోచనతో అత్యవసరంగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

బుధవారం టీవీకే ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. తాను ఎంత క్రమశిక్షణతో నడుచుకుంటున్నా, ఎమ్మెల్యేలు మాత్రం వివాదాస్పదర వైఖరి కారణంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోందని సీఎం ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం విజయ్ ఎమ్మెల్యేలపై కఠిన వైఖరి ప్రదర్శించేందుకు సాహసిస్తారా? అనేది ఉత్కంఠకు గురిచేస్తోంది. మెజార్టీ కోసం ఇతర పార్టీలపై ఆధారపడిన సీఎం విజయ్ సొంత పార్టీ వారిపై వేటు వేసే అవకాశాలు లేవని, అలా అని ఉపేక్షిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంలో సీఎం విజయ్ తీసుకోబోయే నిర్ణయాలు సస్పెన్స్ గా మారాయి.

Tags:    
  • vijay 
  • tvk 
  • tvkmlas 
  • ravishankar 
  • arulvignesh 
  • tamilnadupolitics 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS