• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం...

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆరాటం.. ఆర్టీఐతో పోరాటం..ఇదో సాధారణ బ్రేకప్ స్టోరీ కాదు సామీ

| తమిళనాడుకు చెందిన సంతోష్ అనే వ్యక్తి బ్రేకప్ తర్వాత మాజీ ప్రేయసి వివరాల కోసం 97 సార్లు ఆర్టీఐ దరఖాస్తులు చేసి 1,886 ప్రశ్నలు అడిగాడు. ఆమె ఎవరితో డేటింగ్ చేసింది, పెళ్లయిందా, ఎక్కడుంది వంటి వ్యక్తిగత వివరాలు కోరాడు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళనాడు సమాచార కమిషన్ అతడిపై ఏడాది పాటు ఆర్టీఐ నిషేధం విధించి, కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించింది.

By - A.N.Kumar
Update: 2026-11-07 14:05 GMT

ప్రేమలో పడటం సహజం.. బ్రేకప్ అయ్యాక బాధపడటం ఇంకా సహజం. కొందరు దేవదాసుల్లా మారి గుండెలు బాదుకుంటారు.. మరికొందరు 'దేవదాసు' మోడ్ నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి పెడతారు. కానీ తమిళనాడుకు చెందిన సంతోష్ అనే మహానుభావుడు మాత్రం రూట్ మార్చాడు. ప్రేమ విఫలమైతే డిప్రెషన్‌లోకి వెళ్లడమో లేదా సైలెంట్‌గా ఊరుకోవడమో పాత పద్ధతి అనుకున్నాడేమో.. ఏకంగా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) అస్త్రంగా మార్చుకుని వార్తల్లోకి ఎక్కాడు..

తమిళనాడులోని విల్లుపురంలో 2021-24 మధ్య ఒక యువతితో సంతోష్‌కి పరిచయం ఏర్పడింది. కొంతకాలం సన్నిహితంగా ఉన్నా అతగాడి తీరు సరిగ్గా లేకపోవడంతో ఆ అమ్మాయి అతడికి గుడ్ బై చెప్పేసింది. అక్కడితో కథ ముగిసి ఉంటే అది ఒక సాధారణ బ్రేకప్ స్టోరీ అయ్యేది. కానీ మనోడికి ఆరాటం ఆగలేదు. ఆమె ఏమైపోయింది? ఎక్కడుంది? అని తెలుసుకోవడానికి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల మీద పడ్డాడు.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 97 సార్లు ఆర్టీఐ దరఖాస్తులు చేసి 1,886 విచిత్రమైన ప్రశ్నల వర్షం కురిపించాడు. "ఆమె ఎంతమందితో డేటింగ్ చేసింది?".. "ఆమెకు పెళ్లయిందా?".. "ప్రస్తుతం ఎక్కడుంది?" అంతెందుకు "ఆమె ఇంకా బతికే ఉందా?" అంటూ అధికారులకు చుక్కలు చూపించాడు. ప్రజా ప్రయోజనాల కోసం వచ్చిన చట్టాన్ని తన 'ఎక్స్' వ్యక్తిగత జాతకం కనుక్కోవడానికి వాడేసరికి ఆర్టీఐ అధికారుల మతులు పోయాయి..

ఈ 'అతి ఆరాటం' వ్యవహారం చివరకు తమిళనాడు సమాచార కమిషన్ వద్దకు చేరింది. సంతోష్ క్రియేటివిటీకి షాక్ తిన్న కమిషన్.. "బాబోయ్.. ఈ ఆర్టీఐని వ్యక్తిగత కక్షలకు.. వేధింపులకు వేదికగా మార్చకండిరా సామీ" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షగా అతడిని ఏడాది పాటు ఎలాంటి ఆర్టీఐ దరఖాస్తులు చేయకుండా నిషేధించడమే కాకుండా తక్షణమే కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశించింది.

మాజీ ప్రేయసి గతం.. వర్తమానం తెలుసుకోవాలని బయలుదేరిన ఈ 'మోడర్న్ దేవదాస్'కి చివరకు లభించింది ఆమె వివరాలు కావు.. ఏడాది పాటు ఆర్టీఐకి దూరంగా ఉండాలన్న కమిషన్ ఆర్డర్.. అలాగే ఉచిత కౌన్సెలింగ్.. ప్రేమ కథలో క్లైమాక్స్ అనుకున్నది కాస్తా.. చివరకు సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్ ఎపిసోడ్‌గా ముగియడంతో నెటిజన్లు "నువ్వెక్కడ తయారయ్యావ్ రా సామీ" అని నవ్వుకుంటున్నారు.

Tags:    
  • tamilnadu 
  • rti 
  • breakupstory 
  • exgirlfriend 
  • informationcommission 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS