• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విజయ్ జగన్ కేటీఆర్...ఒకే...

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

| చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ, ఉజ్వల్ వివాహ వేడుకలో తమిళనాడు సీఎం విజయ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ముగ్గురు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైఎస్ భారతి, విజయమ్మ, షర్మిలతో పాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా వేడుకకు హాజరైనట్లు సమాచారం.

By - Satya P
Update: 2026-11-06 01:43 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లొ కనిపించి సోషల్ మీడియాని షేక్ చేశారు. వారి ఫ్యాన్స్ ని హుషారెత్తించారు. ఈ అరుదైన కలయిక ఎక్కడ ఎప్పుడు జరిగింది అంటే వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుకలో. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ ముగ్గురు నాయకులు. వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయా రెడ్డి వివాహ వేడుకలో వైఎస్ జగన్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపైన కనిపించి సందడి చేశారు.

చెన్నై వేదికగా :

విషయానికి వస్తే తమిళ రాజధాని చెన్నైలోని ప్రతిష్టాత్మక లీలా ప్యాలెస్ హోటల్‌లో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలోనే రాజకీయ ప్రముఖుల కలయిక జరిగింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం మొత్తం వేడుకకే విశేష ఆకర్షణగా నిలిచింది.

మూడు రాష్ట్రాలు మూడు పార్టీలు :

విజయ్ జగన్ కేటీఆర్ ముగ్గురూ ఇంచుమించు ఒకే ఏజ్ కి చెందిన వారు. ముగ్గురు యువ నాయకులు. అందులో జగన్ సీఎం గా చేసిన సీనియర్ నేత అయితే కేటీఆర్ సీఎం ఒక్కటి తప్ప కీలక శాఖలు నిర్వహించిన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఇక విజయ్ వెండి తెర మీద దళపతి, ఆరు నెలల క్రితం సీఎం గా తమిళనాడులో సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు. మరో వైపు 2028 లో తెలంగాణా సీఎం కావాలని కేటీఆర్, 2029 లో ఏపీ సీఎం కావాలని జగన్ టార్గెట్లు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కలయిక అయితే దక్షిణాది రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ముగ్గురూ కూడా నాన్ బీజేపీ కూటమికి చెందిన వారు కావడం మరో విశేషంగా చెబుతున్నారు.

హాజరైన ప్రముఖులు :

ఇదిలా ఉంటే ఈ వేడుకకు వైఎస్ జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితర వైఎస్సార్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా ఈ శుభకార్యానికి హాజరైనట్లు చెబుతున్నారు. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ, ఉజ్వల్‌ల వివాహానికి హాజరైన ప్రముఖులంతా నూతన దంపతులను ఆశీర్వదించారు.

Tags:    
  • josephvijay 
  • ysjagan 
  • ktr 
  • ysfamilywedding 
  • chennai 
  • southindianpolitics 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS