• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  టాప్ స్టోరి: యంగ్...

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

| క్రీడాకారులు చేసే చిన్న పొరపాట్లు వారి కెరీర్‌ను ప్రమాదంలో పడేస్తాయని యాంటీ డోపింగ్ నిబంధనలు హెచ్చరిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్, మందులు, కల్తీ సప్లిమెంట్లు వాడటం, వేర్‌అబౌట్స్ వివరాలు అప్‌డేట్ చేయకపోవడం వల్ల సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రిస్ లిన్, సంజీతా చాను, సుమిత్ సంగ్వాన్ వంటి క్రీడాకారులు ఈ నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యువ అథ్లెట్లు WADA నిబంధనలపై అవగాహన పెంచుకోవడం అవసరం.

By - Sivaji Kontham
Update: 2026-11-06 14:30 GMT

క్రీడారంగంలో విజయాలు సాధించడం ఎంత కష్టమో.. ఒక చిన్న తప్పుతో ఆ కష్టాన్ని, సాముపార్జ‌న‌ను నాశనం చేసుకోవడం అంత తేలిక. వర్ధమాన క్రీడాకారులు ఎంతో శ్రమించి...క్రమశిక్షణతో పైకి ఎదుగుతున్న సమయంలో కొన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన లేకపోతే కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకుంటారు. వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (WADA) అమల్లోకి తెచ్చిన నిబంధనలు కేవలం మైదానంలో ఆడే ఆటకు మాత్రమే పరిమితం కావు. మైదానం వెలుపల క్రీడాకారులు ప్రవర్తించే విధానం.. వారు తీసుకునే మందులు.. ఆహార అలవాట్లు కూడా వారి భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

క్రీడాకారులు చేసే అతి పెద్ద తప్పులలో ప్రధానమైనది నిషేధిత పదార్థాలు లేదా వ్యసనాలకు గురిచేసే మత్తు పదార్థాలను ఉపయోగించడం. డ‌బ్ల్యూఏడిఏ నిబంధనల ప్రకారం.. ఆట‌లో ప్రదర్శనను పెంచే స్టెరాయిడ్లు మాత్రమే కాకుండా.. మైదానం బయట తీసుకునే కొకైన్, గంజాయి వంటివి కూడా యాంటీ-డోపింగ్ నియమ ఉల్లంఘన (ఏడిఆర్) పరిధిలోకి వస్తాయి. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్, కోల్‌క‌త నైట్ రైడ‌ర్స్ -కేకేఆర్ (ఐపీఎల్) ఆట‌గాడు క్రిస్ లిన్ వినోదభరిత డ్రగ్ వాడకం కారణంగా ఒక నెల నిషేధాన్ని ఎదుర్కోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అతడు టోర్నీలు లేని సమయంలో ఈ తప్పు చేసినా డ‌బ్ల్యూఏడిఏ తనిఖీల్లో దొరికిపోయి సస్పెన్షన్ శిక్ష పడటంతో పాటు పరువు కోల్పోవాల్సి వచ్చింది.

రెండో ప్రమాదకరమైన అంశం `ఇన్-కాంపిటీషన్`, `అవుట్-ఆఫ్-కాంపిటీషన్` నిబంధనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నిర్లక్ష్యం చేయడం. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు రాత్రి నుంచి నమూనాల సేకరణ ముగిసే వరకు ఉన్న సమయంలో ఏ చిన్న నిషేధిత మూలకం శరీరంలో ఉన్నా 2 నుండి 4 సంవత్సరాల వరకు సుదీర్ఘ కాల నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల వృత్తిపరమైన కెరీర్ నాశనమవుతుంది. మైదానంలో ఆడేటప్పుడు మాత్రమే కాకుండా... విశ్రాంతి సమయంలో కూడా క్రీడాకారులు తమ శరీరంలోకి ఏ పదార్థం వెళ్తుందో పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మూడో తీవ్రమైన పొరపాటు ఏమిటంటే అథ్లెట్ వేర్‌అబౌట్స్ సమాచారాన్ని సరిగా అందించకపోవడం.. అనారోగ్యం వచ్చినప్పుడు సొంత వైద్యం చేసుకోవడం. అగ్రశ్రేణి అథ్లెట్లు తాము ఎక్కడ ఉంటున్నారో WADA పోర్టల్‌లో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి. సంవత్సరంలో మూడు సార్లు ఈ వివరాలు ఇవ్వడంలో విఫలమైతే దాన్ని డోపింగ్ ఉల్లంఘనగానే పరిగణిస్తారు. అలాగే సాధారణ జలుబు, జ్వరం వచ్చినప్పుడు కూడా వైద్యుల సలహా లేకుండా మందులు వాడితే అందులోని కొన్ని రసాయనాలు డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలి ముప్పు తెచ్చిపెడతాయి.

వర్ధమాన క్రీడాకారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే.. స్వల్పకాలిక ఆనందం లేదా నిర్లక్ష్యం ఏళ్ల తరబడి పడ్డ కష్టాన్ని ఒక్క క్షణంలో బూడిద పాలు చేస్తుంది. క్రికెట‌ర్ క్రిస్ లిన్ కేసులో అతడు తప్పును ఒప్పుకొని, స్వచ్ఛందంగా రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ పూర్తి చేయడం వల్ల సస్పెన్షన్ కాలం తగ్గినా.. ఒక క్రీడాకారుడిగా అతడి రికార్డుపై అది మచ్చగానే మిగిలిపోయింది. కాబట్టి యువ అథ్లెట్లు కేవలం ఆటపైనే కాకుండా డ‌బ్ల్యూ.ఏ.డి.ఏ నిబంధనలపైనా.. యాంటీ-డోపింగ్ సూత్రాలపైనా పూర్తి అవగాహన పెంచుకొని.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడమే సుదీర్ఘ విజయవంతమైన కెరీర్‌కు ఏకైక మార్గం.

తెలియ‌క చేసిన త‌ప్పు అయినా:

క్రీడారంగంలో నిబంధనలపై పూర్తి అవగాహన లేకపోవడం లేదా అనుకోకుండా జరిగే చిన్న పొరపాట్ల వల్ల తెలిసి తప్పు చేయకపోయినా `స్ట్రిక్ట్ లయబిలిటీ`నియమం ప్రకారం తీవ్రమైన శిక్షలు అనుభవించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. సాధారణ జలుబు, దగ్గు కోసం సాధారణ మెడికల్ షాపులో లభించే మందులు వాడి.. అందులోని కొద్దిపాటి నిషేధిత ఉత్ప్రేరకాల వల్ల భారత వెయిట్‌లిఫ్టర్ సంజీతా చాను, బాక్సర్ సుమిత్ సంగ్వాన్ వంటి వర్ధమాన క్రీడాకారులు ఏళ్ల తరబడి నిషేధాన్ని ఎదుర్కొని తమ కెరీర్ సవర్ణ సమయాన్ని కోల్పోయారు. అలాగే తాము వాడే డైటరీ సప్లిమెంట్లలో తయారీదారుల కల్తీ వల్ల అక్షయ్ భండార్కర్ వంటి అథ్లెట్లు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలి తమ అమాయకత్వాన్ని నిరూపించుకోలేక సుదీర్ఘ నిషేధ శిక్షలను అనుభవించాల్సి వచ్చింది.

Tags:    
  • antidoping 
  • wada 
  • youngathletes 
  • sportsawareness 
  • athletecareer 
  • dopingrules 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS