• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  పాక్ పై కొట్టింది కానే...

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

| విరాట్ కోహ్లీ తనకు ఇష్టమైన వన్డే ఇన్నింగ్స్‌ల వివరాలను వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చేసిన 43 పరుగులు తన బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 35 పరుగుల ఇన్నింగ్స్‌ను రెండో స్థానంలో నిలిపాడు. భారీ స్కోర్ల కంటే జట్టు విజయానికి దోహదపడిన ఈ ఇన్నింగ్స్‌లే తనకు ప్రత్యేకమని తెలిపాడు.

By - A.N.Kumar
Update: 2026-11-05 16:14 GMT

విరాట్ కోహ్లీ.. ద ఛేజింగ్ మాస్టర్.. చేజింగ్ చేసి భారత జట్టును గెలిపించడంలోనే ఆయన తన కిక్కును వెతుక్కుంటాడు. అలాంటి కోహ్లీ ఇష్టమైన వన్డే ఇన్నింగ్స్ ఏంటో తెలుసా? అందరూ పాకిస్తాన్ పై కొట్టిన ఆ ఇన్నింగ్స్ నే అని అంతా ఫిక్స్ అయిపోతారు. కానీ ఆ ఇన్నింగ్స్ అసలు కోహ్లీ బెస్ట్ ఇన్నింగ్స్ నే కాదట.. తాజాగా బయటపెట్టేశాడు..

స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘విన్నర్స్ స్టేస్ ఆన్’ కార్యక్రమంలో విరాట్ తన బర్త్ డే నాడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కోహ్లీ కెరీర్ తొలినాళ్లలో ధోని సారథ్యంలో ఆడిన ఇన్నింగ్స్ లను తన బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లుగా చెప్పుకొచ్చాడు. అప్పట్లో కోహ్లీ రన్స్ తోనే టీమిండియా గెలిచింది. ఫైనల్ లోనూ గెలిపించాడు. అందుకే తక్కువ కొట్టినా కూడా అవే తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అని చెప్పుకొచ్చాడు.

2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్ పై చేసిన 43 రన్స్ తన బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్లేసులో 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 35 పరుగుల ఇన్నింగ్స్ ఉంటుందని చెప్పాడు.

విశేషం ఏంటంటే ఈ రెండు ఇన్నింగ్స్ లు చూస్తే కనీసం హాఫ్ సెంచరీ లేవు.. సెంచరీలు లేవు. కానీ టీమిండియాను గెలిపించడంలో తన వంతుగా విరాట్ చేసిన పరుగులు భారత జట్టును విజయతీరాలకు చేర్చాయి. అందుకే భారీ సెంచరీలను కాదని.. పాకిస్తాన్ పై కొట్టిన పరుగులను కాదని వీటిని కింగ్ కోహ్లీ ఎంచుకోవడం విశేషం.

దీన్ని బట్టి కోహ్లీకి తన సెంచరీల కంటే.. కూడా జట్టు విజయమే ముఖ్యమని.. కప్ కొట్టినప్పుడు చేసిన ఆ కొన్ని పరుగులే ఎంతో ముఖ్యమని అర్థమవుతోంది.రన్ మెషీన్ గా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఎప్పుడూ దేశం కోసం.. జట్టు కోసం ఆడేందుకు ముందుంటాడు. టీం గెలుపునకే అతడు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అందుకే తన చిన్న పరుగులను కూడా జట్టుకు కప్ అందిస్తే వాటినే తన జీవితంలోని అద్భుత మైన ఇన్నింగ్స్ లుగా అభివర్నించడం విశేషం.

Tags:    
  • viratkohli 
  • kingkohli 
  • championstrophy2013 
  • indiancricket 
  • cricket 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS