ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్
| పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినట్లు కథనం పేర్కొంది. 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించిన 41 ఏళ్ల రొనాల్డో, 23 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ సందేశం ఇచ్చినట్లు తెలిపింది. అయితే క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం మరికొంతకాలం కొనసాగనున్నట్లు కథనం పేర్కొంది.
ఫుట్ బాల్ లోనే మేరునగధీరుడు.. అత్యధిక గోల్స్ వీరుడు అస్త్ర సన్యాసం చేశాడు. పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఫుట్ బాల్ చరిత్రలోనే ఓవరాల్ గా అత్యధిక గోల్స్ 985 కొట్టిన రికార్డ్ 41 ఏళ్ల దిగ్గజ ప్లేయర్ రొనాల్డో పేరిట ఉంది. గత ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఓటమితోనే రొనాల్డో రిటైర్ మెంట్ ప్రకటిస్తాడని ఆశించినా అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. కానీ నేడు సోషల్ మీడియా వేదికగా అర్ధాంతరంగా రిటైర్ మెంట్ ను ప్రకటించాడు. దీనికి పలు కారణాలున్నాయి.
గత నెలలో నేషన్స్ లీగ్ మ్యాచ్ లో కోచ్ జార్జ్ జీసస్ కు.. రొనాల్డోను ఆడించకపోవడంతో వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో ఈ స్టార్ ప్లేయర్ జట్టు శిబిరం నుంచి బయటకు వచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే రొనాల్డో రిటైర్ మెంట్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
రొనాల్డో పోర్చుగల్ తరుఫున 234 మ్యాచులు ఆడి 146 గోల్స్ సాధించాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఘనత అతడిదే.. వ్యక్తిగతంగా ఎంత సాధించినా తన జట్టును ప్రపంచకప్ లో విజేతగా నిలిపి ట్రోఫీని చేతిలో తీసుకుంటేనే ఏ ఆటగాడి కెరీర్ అయినా పరిపూర్ణం అవుతుంది. కానీ రొనాల్డోకు ఇది అందని ద్రాక్షగా మారింది. అయితే రొనాల్డో అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికినా కొన్నేళ్లు క్లబ్ ఆటగాడిగా అలరించనున్నాడు.
రొనాల్డో తన వీడ్కోలు సందేశంలో ఏమోషనల్ అయ్యాడు. 23 ఏళ్లుగా తన 7వ నంబర్ జెర్సీని ధరించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాను. ఆ బాధ్యత నాకు దక్కింది. దీనిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన సమయమొచ్చింది. ఇది అంత సులభమైన నిర్ణయం కాదని.. కొన్ని నిర్ణయాలను బుద్దితో మాత్రమే తీసుకోలేమని.. వాటి వెనుక హృదయ స్పందన ఉంటుందని.. 2003 ఆగస్టులో మొదలైన నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఈ ప్రయాణం నేటితో ముగిసిందని రొనాల్డో తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.
రొనాల్డో జట్టులోకి వచ్చాక ప్రపంచకప్ లో ఒకసారి సెమీఫైనల్ వరకూ పోల్చుగల్ చేరుకుంది. ఇక ఐదుసార్లు ఫిఫా అత్యుత్తమ ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు. 3 యూఈఎఫ్ఏ అవార్డులు పొందాడు. 4 యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డులు దక్కాయి. రొనాల్డో రిటైర్ మెంట్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఏమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు.