ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!
| స్పెయిన్‌కు చెందిన టెనెరిఫే క్లబ్ ఆటగాడు జీసస్ డి మిగెల్ (30).. అండోరా జట్టు గోల్‌కీపర్ జీసస్ ఒవోనోతో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జరిగిన ప్రమాదం ఓ ఆటగాడి ప్రాణాలను బలిగొంది. స్పెయిన్‌కు చెందిన టెనెరిఫే క్లబ్ ఆటగాడు జీసస్ డి మిగెల్ (30).. అండోరా జట్టు గోల్‌కీపర్ జీసస్ ఒవోనోతో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.
సోమవారం టెనెరిఫే, అండోరా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆట చివరి నిమిషాల్లో బంతి కోసం ముందుకు వచ్చిన గోల్‌కీపర్ ఒవోనో.. డి మిగెల్ ఛాతీకి బలంగా తగిలాడు. దీంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం డి మిగెల్ మరణించినట్లు టెనెరిఫే క్లబ్ ప్రకటించింది.
ఈ ఘటన తర్వాత మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. ప్రమాదానికి కారణమైన గోల్‌కీపర్‌కు రెడ్ కార్డు చూపించారు. మరోవైపు, ఆటగాడి మృతిపై స్పెయిన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఇది ఆటలో జరిగిన ప్రమాదం కావడంతో గోల్‌కీపర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగా ఉందని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.
డి మిగెల్ మృతితో టెనెరిఫే క్లబ్లో విషాదం నెలకొంది. క్లబ్ ఆరు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అతడి మృతికి స్పెయిన్‌తో పాటు పలు దేశాల ఫుట్‌బాల్ క్లబ్‌లు, ప్రముఖ ఆటగాళ్లు సంతాపం తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్య కొన్ని మ్యాచ్‌లను కూడా వాయిదా వేసింది.