రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్
| ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందే ఆటగాళ్ల పారితోషికంపై భారీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరు స్టార్ క్రికెటర్లు తమను జట్టులో కొనసాగించాలంటే రూ.40 కోట్లు చెల్లించాలని ఫ్రాంచైజీలకు సంకేతాలు ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 2028 నాటికి జట్టు వేలం పర్స్ రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెరగవచ్చనే అంచనాల నేపథ్యంలో ఈ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం రిషభ్ పంత్ రూ.27 కోట్ల రిటెన్షన్ ధర రికార్డుగా ఉంది. ఒక్క ఆటగాడికే రూ.40 కోట్లు కేటాయిస్తే మిగతా జట్టు కూర్పుపై ప్రభావం పడే అవకాశముంది.
కోట్లు కుమ్మరించడం.. ఆపై ఆటగాడి ఫ్లాప్ పర్ఫార్మెన్స్ చూసి "అయ్యో దేవుడా" అని తలబాదుకోవడం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కొత్తేమీ కాదు.. నిన్నమొన్నటి వరకు రిషభ్ పంత్‌పై రూ. 27 కోట్లు పెట్టి లక్నో సూపర్ జాయింట్స్ బోర్లా పడితే... ‘ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’ అన్నట్లుంది కొందరు స్టార్ క్రికెటర్ల వ్యవహారం. 2028 మెగా వేలానికి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ "మమ్మల్ని రిటైన్ చేసుకోవాలంటే ఏకంగా రూ. 40 కోట్లు సమర్పించుకోవాల్సిందే" అని ఫ్రాంచైజీలకు మైండ్ బ్లాకింగ్ ఆఫర్లు పంపుతున్నారట... టీమ్ మొత్తం పర్స్ బడ్జెట్ రూ. 150 కోట్లకు పెరుగుతుందనే సరికి, అందులో నాలుగో వంతు కంటే ఎక్కువ సొమ్మును ఒక్కరి జేబులోనే నింపేయాలనే ఈ ‘ధన దాహం’ చూసి ఓనర్లు ఒక్కసారిగా బిత్తరపోతున్నారు.
ఇప్పటివరకూ ఐపీఎల్ లో అత్యధికంగా ఒక ఆటగాడి కోసం పెట్టిన వేలం ధర రూ.27 కోట్లు.. ఇది చూసే అందరూ నోరెళ్ల బెట్టారు. బాప్ రే ఇంత డబ్బా అంటూ ఆశ్చర్యపోయారు. ఆ లక్కీ ఫెలో ఎవరో కాదు.. మన రిషబ్ పంత్. వేలం పాట పడింది లక్నో సూపర్ జాయింట్స్. కానీ పంత్ ఆ కోట్ల డబ్బు భారంతో సరిగ్గా ఆడక చివరకు అవమానకర రీతిలో ఫ్రాంచైజీనే మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐపీఎల్ అంటేనే కోట్ల రూపాయల వ్యాపారం. మైదానంలో ఆటగాళ్లు పరుగులు.. వికెట్లతో అభిమానులను అలరిస్తుంటే.. మైదానం బయట ఫ్రాంచైజీలు కోట్ల రూపాయల లెక్కల్లో మునిగిపోతుంటాయి. అయితే ఇప్పుడు ఐపీఎల్‌లో ఆటగాళ్ల ధరల విషయంలో మరో సంచలనం తెరపైకి వచ్చింది. వచ్చే మెగా వేలానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ కొందరు స్టార్ క్రికెటర్లు ఇప్పటి నుంచే తమ మార్కెట్ విలువను భారీగా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఒక్కో ఆటగాడిని రిటైన్ చేసుకోవాలంటే రూ.40 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట.. నిజంగా ఇదీ నిజం..
ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందు కొందరు టాప్ ప్లేయర్లు తమను జట్టులో కొనసాగించాలంటే ఏకంగా రూ.40 కోట్ల పారితోషికం ఇవ్వాలని ఫ్రాంచైజీలకు సంకేతాలు పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం సంచలనమైంది. అంటే వేలంలో పోటీ పడితే ఎంత ధర పలుకుతామో తెలియదు కానీ ముందుగానే తమ విలువను ఫ్రాంచైజీలకు తెలియజేసి ఆటగాళ్లు ఇలా డిమాండ్ చేస్తున్నారన్న మాట..
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రిటెన్షన్ ధరగా రిషభ్ పంత్‌కు లభించిన రూ.27 కోట్లు పలికాయి. ఇప్పుడు అదే రికార్డును దాదాపు రూ.13 కోట్ల తేడాతో అధిగమించేలా రూ.40 కోట్ల డిమాండ్ వినిపించడం చర్చనీయాంశమవుతోంది.
అయితే ఆటగాళ్ల ఈ అత్యధిక డిమాండ్ కు ఓ లెక్క ఉంది. 2028 నాటికి ఒక్కో ఐపీఎల్ జట్టు వేలం పర్స్‌ను ప్రస్తుతమున్న రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచబోతున్నారట.. దీంతో తమ రేట్లు కూడా పెంచాలని ఆటగాళ్లు ఇప్పటి నుంచి డిమాండ్లు మొదలుపెట్టారన్న మాట.. అదీ సంగతి..
ఒక జట్టు వద్ద రూ.150 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు తన జట్టుకు విజయాలు అందించే కీలక ఆటగాడి కోసం రూ.40 కోట్లు ఖర్చు చేయడానికి ఫ్రాంచైజీ వెనుకాడకపోవచ్చు. అయితే ఒక ఆటగాడికే బడ్జెట్‌లో నాలుగో వంతుకు పైగా కేటాయిస్తే మిగిలిన ఆటగాళ్ల ఎంపిక ఎలా ఉంటుందనేది మరో ప్రశ్న. 40 కోట్లు పెట్టిన ఆటగాడు ఆ సీజన్ లో రాణించకపోతే అటు జట్టుకు దారునంగా లాస్.. ఇటు ఆటగాడిపై ఒత్తిడి పెరిగి చిత్తవుతాడు.. రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. మరి ఈ విషయంలో ఐపీఎల్ జట్లు ఎలా ఆలోచిస్తాయి? అంత పెడుతాయా? ఆటగాళ్లను కొంటాయా? అన్నది తెలియాలంటే వచ్చే మెగా వేలం వరకూ వెయిట్ చేయాల్సిందే..