• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  న‌చ్చిన టైం వేస్తామంటే...

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

| అరెస్టు చేసిన సమయం విషయంలో పోలీసులు ఇష్టానుసారంగా రికార్డులు మార్చేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడిని ఏ క్షణంలో అదుపులోకి తీసుకున్నారో అప్పటి నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని తేల్చిచెప్పింది. అరెస్టు వివరాలను ఆలస్యంగా నమోదు చేసి, తమకు అనుకూలమైన సమయం చూపించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. నిందితుడిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని, ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించవచ్చని దేశవ్యాప్తంగా పోలీసులకు స్పష్టం చేసింది.

By - Garuda Media
Update: 2026-11-06 09:22 GMT

దేశ‌వ్యాప్తంగా పోలీసుల‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా కేసులో నిందితుల‌ను అరెస్టు చేసిన‌ప్పుడు.. పోలీసులు న‌మోదు చేసే స‌మ‌యం విష‌యంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ``అరెస్టు చేసిన త‌ర్వాత‌.. 24 గంట‌ల్లోగా మేజిస్ట్రేటు ముందు హాజ‌రుప‌ర‌చాలి.``-అనే ప్రొసీడింగ్స్ ను పోలీసులు పాటించే విష‌యంలో చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని పేర్కొంది. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ అంగీక‌రించేది లేద‌ని పేర్కొంది.

అరెస్టు చేసిన తర్వాత‌.. కొన్ని గంట‌లు లేదా.. రోజుల పాటు ఆ విష‌యాన్ని దాచి పెట్టి.. త‌మ‌కు వీలైన స‌మ‌యాన్ని నమోదు చేసి.. అక్క‌డి నుంచి 24 గంట‌లలోగా కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌డం అంటే.. క్రిమిన‌ల్ ప్రొసీజ‌రీ కోడ్ స‌హా.. స‌హ జ న్యాయ‌సూత్రాలు, వ్య‌క్తిగ‌త హ‌క్కులు, మాన‌వ హ‌క్కుల‌ను కూడా హ‌రించ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఇలాంటి సంకుచిత వ్య‌వ‌హారాల‌కు తావు లేద‌ని పేర్కొంది. మీరు న‌చ్చిన స‌మ‌యాన్ని వేసి.. అక్క‌డ నుంచి 24 గంట‌లు లెక్కించుకునేందుకు చ‌ట్టం అనుమ‌తించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

నిందితుడిని ఏక్ష‌ణంలో అదుపులోకి తీసుకున్నారో.. ఆ క్ష‌ణం నుంచి 24 గంట‌లు వ‌ర్తిస్తాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొం ది. అదుపులోకి తీసుకోవ‌డం.. జ‌రిగిపోయాక‌.. కొన్ని రోజులు గ‌డిచిన త‌ర్వాత‌.. అరెస్టును చూపించ‌డం కూడా నేర‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఇలా చేయ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. నిందితుడిని ఇంట్లో అదుపులోకి తీసుకున్నా.. మ‌రెక్క‌డ అదుపులోకి తీసుకున్నా.. ఆ క్ష‌ణ‌మే అరెస్టు అయిన‌ట్టుగా ప‌రిగ‌ణించి 24 గంట‌ల్లోనే మేజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చాల‌ని తేల్చి చెప్పింది.

అయితేఈ ప్ర‌క్రియ‌లో అరెస్టు చేసిన స్థ‌లానికి.. మేజిస్ట్రేట్ కార్యాల‌యం, లేదా కోర్టుకు మ‌ధ్య దూరం ఎక్కువ‌గా ఉంటే.. ఆ ప్ర‌యాణ స‌మ‌యాన్ని మాత్ర‌మే మిన‌హాయించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కోర్టు తెలిపింది. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన కేసు విష‌యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. దేశ‌వ్యాప్తంగా అరెస్టులు, అదుపులోకి తీసుకునే విష‌యంలో ఈ నియ‌మ‌మే వ‌ర్తిస్తుంద‌ని కోర్టు తెలిపింది.

Tags:    
  • supremecourt 
  • arrestrules 
  • policeguidelines 
  • indianjudiciary 
  • criminaljustice 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

Copyright @2026

Powered by Blink CMS