'రాధా-రంగా' మిత్రమండలికి జోష్.. !
| విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు 2,65,968 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి 1,35,056 ఓట్లు వచ్చాయి. మొత్తం 86 డివిజన్లలో కూటమి 76 స్థానాలు గెలుచుకుంది. రాధా పుట్టినరోజునే ఫలితం రావడంతో రాధా-రంగా మిత్రమండలి అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ (వంగవీటి రాధా) రికార్డు స్థాయి మెజారిటీతో మేయర్‌గా ఘనవిజయం సాధించడంతో రాధా-రంగా మిత్రమండలి లో పండగ వాతావరణం నెలకొంది. సుదీర్ఘ విరామం తర్వాత వంగవీటి కుటుంబానికి లభించిన ఈ భారీ విజయం రంగా రాజకీయ వారసత్వాన్ని విజయవాడలో తిరిగి బలంగా నిలబెట్టిందని అభిమానులు మురిసిపోతు్నారు. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిని రాయన భాగ్యలక్ష్మిపై 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.
రాధాకృష్ణకు మొత్తం 2,65,968 ఓట్లు రాగా, రాయన భాగ్యలక్ష్మికి 1,35,056 ఓట్లు వచ్చాయి. ఇక, నవంబర్ 4న ఓట్ల లెక్కింపు పూర్తి కావడం, అదే రోజు వంగవీటి రాధాకృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానుల ఆనందం రెట్టింపయింది. కేవలం మేయర్ స్థానమే కాకుండా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 86 డివిజన్లలో కూటమి ఏకంగా 76 స్థానాలను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. గత అక్టోబర్‌లో వంగవీటి రాధాకృష్ణతో పాటు రాధా-రంగా మిత్రమండలి సభ్యులు అధికారికంగా జనసేన పార్టీ లో చేరారు.
ఇప్పుడు సాధించిన ఈ ఘనవిజయంతో రాధా-రంగా మిత్రమండలి బెజవాడ రాజకీయాల్లో తమ పట్టును చాటుకుంది. పాతికేళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో విజయవాడ మేయర్‌గా ఎన్నికయ్యారు. మరీ ముఖ్యంగా వంగవీటి మోహనరంగా 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవగా.. రంగా హత్యానంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య రత్నకుమారి అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తండ్రి కార్పొరేటర్‌గా..
వంగవీటి మోహనరంగా 1985లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు అయితే అంతకుముందు 1981లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన కృష్ణలంక 40వ డివిజన్లో కార్పొరేటర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన కుమారుడు రాధా విజయవాడ నగరానికి మేయరుగా ఎన్నికకావడం గమనార్హం. ఇక, ఈ పరిణామంతో ఈ కుటుంబానికి అత్యంత కీలకమైన రాధా-రంగా మిత్రమండలి పుంజుకుంటుందని అనడంలో సందేహం. ఈ మిత్ర మండలి.. సేవా కార్యక్రమాలతోపాటు.. రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు ఉంది.