అవును.. సుజ‌నా సైలెంట్ అయిపోయారు.. !

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి సుజ నా చౌద‌రి సైలెంట్ అయిపోయారు.

Update: 2026-10-31 18:30 GMT

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌద‌రి సైలెంట్ అయిపోయారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌న పాత్రేమీ లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా రు. నిజానికి కూట‌మి త‌ర‌ఫున వంగ‌వీటి రాధాకృష్ణ బ‌రిలోకి దిగ‌క‌ముందు.. త‌న త‌ర‌ఫున ఓ కీల‌క నాయ‌కుడికి మేయ‌ర్ పీఠం ఇప్పించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనికి బీజేపీ అధిష్టాన‌మే వ‌ద్ద‌ని వారించింద‌ని తెలిసింది. ఆ త‌ర్వాత కూడా.. సుజ‌నా చౌద‌రి త‌న ప్ర‌య‌త్నాలు సాగించారు.

అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌హకారం అందించేందుకు మాత్ర‌మే ప‌రిమితం కావాల‌న్న అధిష్టానం సూచన‌ల‌తో సుజ‌నా మౌనం వ‌హించార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ ర్గంలో యాక్టివ్‌గానే ఉంటున్నా.. ఆయ‌న పాత్ర మాత్రం త‌క్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది. కూట‌మి రాజ‌కీయాల్లో కానీ.. స్థానికంగా మిత్ర‌ప‌క్షాల నాయ‌కుల‌తో క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించే విష‌యంలో కానీ.. సుజ‌నా పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. దీంతో స్థానిక ఎన్నిక‌ల వేళ సుజ‌నా గురించిన చ‌ర్చ ఎక్కువ‌గా వినిపించ‌డం లేదు.

ఏదీ ఆగ‌దు..

ఇదే విష‌యంపై తాజాగా ఓ ఆన్ లైన్ ఛానెల్కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సుజ‌నా మాట్లాడుతూ.. తాను ఉన్నా.. లేకు న్నా ..ఏదీ ఆగ‌ద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. అంతేకాదు.. స్థానిక ఎన్నిక‌ల విష‌యాన్ని పార్టీ పెద్ద‌లు చూసుకుంటు న్నార‌ని పార్టీ చీఫ్ మాధ‌వ్ స‌మ‌ర్ధుడైన నాయ‌కుడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. స్థానికంగా ఏం జ‌రిగినా.. మాధ‌వ్ బాధ్య‌త‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు వార్డుల్లో బీజేపీ అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నార‌ని.. వారిని త‌న అండ ఎప్పుడూ ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఉంటున్న సుజ‌నా.. స్థానికంగా జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తున్నానని చెబుతున్నారు. కానీ, ఆయ‌న ప్ర‌మేయం పెద్ద‌గా లేద‌న్న‌ది వాస్త‌వం. అయితే.. దీనికి తాను కోరుకున్న వ్య‌క్తికి.. తాను సూచించిన వ్య‌క్తికి.. మేయ‌ర్ గా పోటీ చేసే అవ‌కాశం ద‌క్క‌లేద‌న్న వాద‌న ఉంది. మ‌రోవైపు.. సుజ‌నా గురించి బీజేపీ కూడా పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు లేదు. ముగ్గురు కార్పొరేట‌ర్ అభ్య‌ర్థులు పోటీ లో ఉన్నా.. వారు టీడీపీ నాయ‌కు ల‌తో క‌లిసి ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా.. కీల‌క స‌మ‌యంలో సుజ‌నా సైలెంట్ కావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News