• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  NTR >  ఇక బెట్టింగులు.....

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

| విజ‌య‌వాడ‌లో ప్ర‌ముఖంగా ఈ బెట్టింగుల ప‌ర్వం కొన‌సాగుతోంది. వంగ‌వీటి రాధా జ‌న‌సేన త‌ర‌ఫున మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు.

By - Tupaki Desk
Update: 2026-11-03 10:04 GMT

రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. బెట్టింగుల ప‌ర్వానికి తెర‌దీశారు. ఈ విష‌యంలో స్థానికంగా ఉన్న నాయ‌కుల‌పైనే కాకుండా.. పార్టీల పై కూడా బెట్టింగులు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆకివీడు వంటి ప్రాంతాల్లో వ్య‌క్తుల కేంద్రంగా కోటి రూపాయ‌ల వ‌ర‌కు బెట్టింగులు జ‌రిగిన‌ట్టు పోలీసులు చెబుతు న్నారు. అయితే.. తెర‌వెనుక ఎవ‌రు ఉన్నార‌న్న‌ది మాత్రం ఎవ‌రూ వెల్ల‌డించ‌లేదు. ఇక‌, విశాఖ‌, విజ‌యవాడ‌, తిరుప‌తి ప్రాంతాల్లోని కార్పొరేష‌న్ల ప‌రిధిలో కూడా బెట్టింగు బాబు తెర‌మీదికి వ‌చ్చారు.

విజ‌య‌వాడ‌లో ప్ర‌ముఖంగా ఈ బెట్టింగుల ప‌ర్వం కొన‌సాగుతోంది. వంగ‌వీటి రాధా జ‌న‌సేన త‌ర‌ఫున మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. అదేస‌య‌మంలో మాజీ ఐపీఎస్ అదికారి ఏవీ వెంక‌టేశ్వ‌ర‌రావు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి సైతం గ‌ట్టిపోటీ ఇచ్చార‌ని అంటున్నారు అయిన‌ప్ప‌టికీ.. వంగ‌వీటి రాధా గెలుపుపైనే ఎక్కువ‌గా బెట్టింగులు క‌ట్టార‌న్న‌ది బెజ‌వాడ టాక్‌. దీనికి ప్ర‌ధానంగా ఆయ‌నపై ఉన్న న‌మ్మ‌క‌మేన‌ని అంటున్నారు.

ఇక‌, విశాఖలో ముక్కా శ్రావ‌ణి వ‌ర్సెస్ వైసీపీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ వ‌ర‌దు క‌ల్యాణి మ‌ధ్య ఈ ఎన్నిక‌ల్లో హోరా హోరీ పోటీ జ‌రిగింద‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోంది. క‌ల్యాణి కూడా దూకుడుగానే ప్ర‌చారం చేశారు. కీల‌క‌మైన అంశాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువ‌చ్చారు. ఇక‌, కూట‌మి యావ‌త్తు.. ముక్కా శ్రావ‌ణికి అండగా నిలిచింది. చివ‌రి నిమిషంలో అంద‌రినీ ఏకం చేయ‌డ‌లో ఎంపీ శ్రీభ‌ర‌త్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య కూడా పోటీ ఎక్కువ‌గానే ఉంద‌ని అంటున్నారు.

అయితే.. చిత్రంగా ఓటింగ్ శాతం విజ‌య‌వాడ‌లో 55 శాతం మించ‌క‌పోగా.. విశాఖ‌లోనూ దాదాపు అదే ప‌రిస్థితి క‌నిపించింది. దీంతో పోటీ తీవ్ర‌త మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు. దీంతో ఎవ‌రు గెలిచినా.. అత్యంత త‌క్కువ మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే బెట్టింగుల‌కు మ‌రింత ఊపు వ‌చ్చింద‌ని చెబుతున్నారు. మెజారిటీ బెట్టింగు రాయుళ్లు శ్రావ‌ణికి అనుకూలంగా ఉన్నారు. ఇక‌, తిరుప‌తిలో కూడా ఇలానే బెట్టింగుల‌కు తెర‌దీశారు. మొత్తంగా వైసీపీ, టీడీపీ, జ‌నసేన‌లు బ‌లంగా ఉన్న చోట బెట్టింగులు తెర‌వెనుక బాగానే సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. వంగ‌వీటిపై ఓ పారిశ్రామిక వేత్త 2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు బెట్టింగు క‌ట్టేందుకు ముందుకు వ‌చ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tags:    
  • aplocalelections 
  • electionbetting 
  • vangaveetiradha 
  • mukkasravani 
  • andhrapradeshpolitics 

Similar News

అవును.. సుజ‌నా సైలెంట్ అయిపోయారు.. !

2026-10-31 18:30 GMT

ఎన్నికలు ఉన్నాయనే షర్మిల ట్వీట్.. జగన్‌పై రాజకీయ కుట్ర - పేర్ని నాని సంచలన ఆరోపణలు

2026-10-31 15:18 GMT

విశాఖ విజయవాడ.... హీటెక్కించే రిజల్ట్స్ !

2026-10-30 19:30 GMT

'ABV - ఏ బెటర్ విజయవాడ'.. ఏబీవీ వినూత్న ప్రచారం!

2026-10-23 09:52 GMT

బెజవాడలో వైసీపీ థర్డ్ ప్లేస్ లోకా ?

2026-10-21 03:43 GMT

ఏబీవీ స్వీయ పరీక్ష.. రిటైర్డ్ ఐపీఎస్ వ్యూహంపై ఇంట్రస్టింగ్ డిబేట్

2026-10-19 18:30 GMT

విజయ్ తెలుగు స్పీచ్ కి విజయవాడ ఫిదా !

2026-10-13 16:54 GMT

బెజవాడ సెంట్రల్ లో కొత్తగా ఓటు.. మేయర్ సీటుపై వంగవీటి స్కెచ్!

2026-10-10 16:57 GMT

టీడీపీకి బరువుగా మారిన కొలికపూడి?

2026-10-06 04:59 GMT

సాయికృష్ణ కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం.. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

2026-09-23 08:59 GMT

దేవినేని అవినాష్ సహా 51 మందిపై రౌడీ షీట్.. విజయవాడ సీపీ సంచలన నిర్ణయం!

2026-09-23 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS