కంటెంట్‌ నియంత్రణ ప్రక్రియ..ట్విటర్‌ సీఈవో కీలక ప్రకటన!

Update: 2021-02-26 16:30 GMT
సోషల్ మీడియా దిగ్గజ సంస్థల్లో ట్విట్టర్ ఒకటిగా వెలుగొందుతుంది. అయితే , ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా సంస్థలపై కొన్ని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వెబ్ ‌సైట్‌ లో కంటెంట్‌ నియంత్రణ ప్రక్రియ మరింత పారదర్శకత ఉండేలా చర్యలు చేపడతామని ట్విటర్‌ సీఈవో జార్క్‌ డార్సీ స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికల పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో ఈ దిశగా ముందుకు వెళతామని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ వెబ్ ‌సైట్‌ చీఫ్‌ డార్సీ శుక్రవారం వెల్లడించారు.

అభ్యంతరకర కంటెంట్‌ పై సోషల్‌ మీడియా సైట్లు తక్షణం స్పందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని భారత్‌ నూతన ఐటీ నిబంధనలను ప్రకటించిన క్రమంలో ట్విటర్‌ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. తమ పొరపాట్లను గుర్తించి చక్కదిద్దే చర్యలు చేపట్టడంలో ట్విటర్‌ గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా ట్విటర్‌ ముందుకు సాగుతుందని అన్నారు. గత కొన్నేండ్లుగా ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ప్రజలు తమ పట్ల విశ్వాసంతో లేరని తాము అంగీకరిస్తామని, ఇది తమ ఒక్కరి సమస్య కాదని ప్రతి సంస్ధ విశ్వాసలేమితో సతమతమవుతోందని వ్యాఖ్యానించారు. ఫేక్‌ న్యూస్‌ ను వ్యాప్తి చేసే ఖాతాలను తొలగించాలని భారత ప్రభుత్వం ట్విటర్‌ ను కోరుతున్న క్రమంలో సోషల్‌ మీడియా దిగ్గజం ఈ కీలక ప్రకటన వెల్లడించడం గమనార్హం.


Tags:    

Similar News