కర్మ అని సరిపెట్టుకుంటే.... పవన్ ట్వీట్ వైరల్

గతంలో కూడా పవన్ ఇదే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి మతాన్ని వారు పరిరక్షించుకోవడం తప్పు కాదని ఆయన అన్నారు. అది ఇతర మతాలకు వ్యతిరేకం అంతకంటే కాదని అన్నారు.;

Update: 2026-02-06 18:25 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా వేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి లడ్డూలో కల్తీ జరిగింది అంటూ విమర్శలు చేశారు. ఈ విషయంలో వాస్తవాలను జనాలకు చెబుతామని అన్నారు. పాపం ఎవరు చేసినా స్వామి వారితో పెట్టుకుంటే ఇబ్బంది తప్పదని హెచ్చరించారు.

చైతన్యం కావాలి అంటూ :

తాజాగా పవన్ వేసిన ట్వీట్ ఏంటి అంటే హిందూ సమాజం చైతన్యం కావాలని. సాధారణంగా హిందువులు ఏమి జరిగినా కర్మ అని సరిపెట్టుకుంటారని ఆయన అందులో పేర్కొన్నారు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారు అని వేదాంత భావనలో ఉంటారు అని పవన్ అన్నారు. అయితే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతీ హిందువు పైనా ఉందని పవన్ ఆ ట్వీట్ లో నొక్కి చెప్పారు. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని ఆయన కోరారు.

దేవీ దేవతలను అవమానిస్తే :

మన దేవుళ్ళను ఎవరైనా అవమానిస్తే బాధ పడడం వరకే కాకుండా మన గొంతు గట్టిగా వినిపించాలని ఆయన కోరారు ఉదాశీన వైఖరి ప్రతీ హిందువూ విడనాడాలని ఆయన అంటున్నారు. హిందూ మతం కులం, ప్రాంతం వర్గం వర్ణం భాష ఇలా విభజన జరిగినా కూడా హిందూ ధర్మం ఒక్కటే అని పవన్ అన్నారు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.

పవన్ ఆవేదన :

గతంలో కూడా పవన్ ఇదే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి మతాన్ని వారు పరిరక్షించుకోవడం తప్పు కాదని ఆయన అన్నారు. అది ఇతర మతాలకు వ్యతిరేకం అంతకంటే కాదని అన్నారు. అందువల్ల హిందువులు ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు నిజానికి చూస్తే హిందూ మతంలో ఈ నెమ్మది తనం ఉంది. కాస్తా మెతక తనం కూడా ఉంది అన్న భావన ఉంది. దానినే కూడదు అని పవన్ అంటున్నారు.

కల్తీ మీద ఆగ్రహం :

నిజానికి ప్రపంచ దేవుడు శ్రీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఆయనకు ప్రతి రూపంగా అంతా భావిస్తారు. అలాంటిది అందులో కల్తీ జరిగింది అన్నది వింటేనే హిందువులు అంతా ఎంతో మధన పడ్డారు, కానీ వారు తమ ధర్మాగ్రహాన్ని మౌనంగానే వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా బయటపడడం లేదు, అయితే వర్తమానంలో అలా ఉంటే కుదరదు అన్నది చాలా మంది భావనగా ఉంది. మన ధర్మం గురించి మనం కాకపోతే ఎవరు మాట్లాడుతారు అన్నది కూడా ఉంది. ఈ విషయంలో చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరిన్ని ఇబ్బందులు వస్తాయని సనాతనవాదులు ఎందరో చెబుతున్నారు పవన్ సైతం ఇదే భావనతో ట్వీట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. మరి ఇది ఎంతమందిలో ఆలోచనలు పెంచుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.




Tags:    

Similar News