తెలంగాణ ప్రాజెక్టులకూ మోడీ శ్రీకారం.. బీజేపీలో జోష్ ఏది?
ఏపీలోని విజయనగరం జిల్లాలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ అదే వేదిక నుంచి మరిన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.
ఏపీలోని విజయనగరం జిల్లాలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ అదే వేదిక నుంచి మరిన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. వీటిలో తెలంగాణలోకి ఖమ్మం, దేవరపల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.అ యితే.. వీటిని ప్రస్తావిస్తూ.. తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడా ప్రకటన చేయకపోవడం.. కనీసంకార్యక్రమాన్ని కూడా నిర్వహించకపోవడం గమనార్హం. నిజానికి ఏపీలో ప్రారంభించిన పలు ప్రాజెక్టుల్లో తెలంగాణకు చెందినవి.. అనుబంధంగాఉన్న ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. కానీ, ఆ తరహా జోష్ తెలంగాణలో కనిపించకపోవడం గమనార్హం.
మోడీ ప్రారంభించిన వాటిలో.. కీలకమైన తెలంగాణ ప్రాజక్టుల విషయానికి వస్తే.. ఖమ్మం-దేవరపల్లి మధ్య ప్రధాన ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం.. కొన్నేళ్లుగా ఇక్కడివారు ఎదురు చూస్తున్నారు. పలు సందర్భాల్లో ప్రభుత్వం కూడా విజ్ఞాపలు సమర్పించింది. ఈ నేపథ్యంలోనే `ఖమ్మం -దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ పోర్ లేన్స్ ఎక్స్‌ప్రెస్‌వే`ను కేంద్రం మంజూరు చేసింది. దీనిని తాజాగా ప్రధాని ప్రారంభించారు. అలాగే ఖమ్మం -దేవరపల్లి ప్యాకేజీలో భాగంగా.. ఎక్స్ ప్రెస్ వే పక్కన గ్రామీణ రహదారులను కూడా ప్రధాని ప్రారంభించారు. వీటిని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు.
అంతేకాదు.. ఈ ప్రాజెక్టు.. సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అయిన.. ఫ్యూచర్ సిటీతోనూ అనుసంధానం చేయనున్నారు. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో తెలంగాణలో ఒక్క కార్యక్రమాన్ని కూడా బీజేపీ నాయకులు ఏర్పాటు చేయక పోవడం గమనార్హం. ఇక, ఏపీలో నిర్మించిన.. అనంతపురం, కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్ మిషన్ పథకాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. అయితే.. ఈరెండు జోన్ల ద్వారా.. కేవలం ఏపీలోని అనంతపురం,కర్నూలు ప్రాంతాలకే కాకుండా.. తెలంగాణలోని అనుబంధ జిల్లాలకు కూడా సౌర విద్యుత్‌ను అందించనున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణలో బీజేపీలో ఎక్కడా చలనం లేకపోవడం గమనార్హం.