ఆహా : జిల్లాల ఏర్పాటుతో వెనుక‌బాటు పోతుందా ?

Update: 2022-04-04 23:30 GMT
జ‌గ‌న్ అనుకున్నారు క‌నుక కొత్త జిల్లాలు వ‌చ్చాయి. జ‌గ‌న్ అనుకుంటున్నా కూడా 3 రాజ‌ధానులు రావ‌డం లేదు. ఆహా ఏమి విచిత్రం. చిత్రం భ‌ళారే విచిత్రం..అయ్యారే విచిత్రం! అని పాడుకోవాలి నవ్యాంధ్రులు. అస‌లు రాష్ట్రం విడిపోయాక వైసీపీ అడిగిన‌వేవో తెలియ‌దు. కేంద్రాన్ని ఆ రోజు ఏమీ అడ‌గ‌లేదు.

అడిగేందుకు  చేయాల్సిన సాహ‌సం ఏమీ చేయలేదు. అప్ప‌టి సీఎం కిర‌ణ్ కు ఏ కొద్దిపాటి చొర‌వ కానీ చ‌నువు కానీ లేవు. ఆ విధంగా ఆయ‌న త‌ప్పుకున్నారు. ఏదో ఒక విధంగా అధికారం ద‌క్కితే చాలు అనుకున్న పార్టీల‌కూ, నెగ్గి నిల‌బ‌డి రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి బాట‌లో న‌డిపిస్తాం అని భావించిన పార్టీల‌కూ మ‌ధ్య వైరం అయితే బాగానే న‌డిచింది.

డ‌బ్బుల‌న్నీ రాజ‌ధానికి పెట్ట‌వ‌ద్దు అని ఆ రోజు అసెంబ్లీలో జ‌గ‌న్ అర‌వ‌లేదు. పోనీ మూడు పంట‌లు పండే నేల‌లు ఎందుకు తీసుకుంటున్నారు ఇది స‌బ‌బు కాదు అని కూడా గౌర‌వ ముఖ్య‌మంత్రికి హిత‌వు చెప్ప‌లేదు. దీంతో ఆ రోజు అమ‌రావ‌తికి ఒప్పుకున్నారు. త‌రువాత అధికారంలోకి వ‌చ్చాక త‌మ నిర్ణ‌యం మార్చుకున్నారు జ‌గ‌న్. దాంతో ఇవాళ కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌నల్లో కూడా ఆ మాటే రాశారు.త్వ‌ర‌లో 3 రాజ‌ధానుల నిర్మాణ‌మే త‌మ ధ్యేయం అని!

పోనీలేండి రాజ‌ధానుల ఏర్పాటు ఎలా ఉన్నా జిల్లాలయితే అనుకున్న స‌మ‌యానికే ఏర్పాటు అయ్యాయి. శ్రీ‌కాకుళం జిల్లాకు ఉన్న వెనుక‌బాటు తొల‌గుతుందా లేదా అన్న‌ది ఇప్ప‌టి సంశ‌యం లేదా సందేహం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా జిల్లాకు అభివృద్ధి అన్న‌ది లేదు. మ‌న్యం ప్రాంతం మొత్తం పార్వతీపురం లో క‌లిసిపోయింది.

అంటే ఇక‌పై పార్వ‌తీపురం మ‌న్యం అన్న‌ది చెలామ‌ణిలో ఉంటుంది. అక్క‌డ పాల‌కొండ నియోజ‌క వ‌ర్గం క‌లిసి పోయింది. అయితే పాల‌కొండ వాసులు మాత్రం మొద‌ట ఈ ఏర్పాటును వ‌ద్ద‌న్నారు. త‌మ‌కు జిల్లా కేంద్రం దూరం అయిపోతుంద‌ని కూడా అన్నారు. అయినా కూడా అవేవీ వినిపించుకోకుండా ఏక‌ప‌క్షంగానే పార్వ‌తీపురం మ‌న్యం అన్న‌ది ఏర్పాటైంది.

క‌నీసం సీతంపేట ఐటీడీఏను శ్రీ‌కాకుళం జిల్లాలో ఉంచ‌కుండా పార్వ‌తీపురం మ‌న్యంలో క‌లిపేశారు. ఇప్పుడు పార్వ‌తీపురం మ‌న్యంలో రెండు ఐటీడీఏలు వ‌చ్చేయి. జిల్లా విభ‌జ‌న‌లో కీల‌కం అనుకున్న ఎచ్చెర్ల  నియోజ‌క‌వ‌ర్గం విష‌య‌మై ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లితం ఇవ్వ‌డంతో ఎట్టకేల‌కు ఈ ప్రాంతం ఇక్క‌డే ఉండిపోయింది, కానీ చివ‌ర్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన జి.సిగ‌డాం మండ‌లం చీపురుప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్లో చూపించారు.

ఈ రెవెన్యూ డివిజన్ కొత్త‌గా ఏర్పాటైంది. దీంతో మ‌ళ్లీ టెన్ష‌న్ రేగింది. ఎట్ట‌కేల‌కు జి.సిగ‌డాం మండలం కూడా శ్రీ‌కాకుళం జిల్లాలోనే ఉంచారు. వాస్త‌వానికి ఈ విషయ‌మై స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్ పెద్ద‌గా మాట్లాడిన దాఖ‌లాలు లేవు. కానీ టీడీపీ నాయ‌కులు కొంత అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కులు కొంత చొర‌వ చూపిన మాట వాస్త‌వం.

ఆ విధంగా స‌మ‌స్య తీరింది. 3 ముక్క‌లైన జిల్లాకు సర్వ‌తోముఖాభివృద్ధి సాధ్యం అని ఎలా అనుకోవాలో మ‌రి! ఇంత‌వ‌ర‌కూ క‌నీసం రెండు కిలోమీట‌ర్ల ర‌హ‌దారికి కూడా నిధులు ఇవ్వ‌లేని వైసీపీ స‌ర్కారు ఇక‌పై ఏం చేయ‌నుందో ?

మంత్రి సీదిరి కృషి ఫ‌లితంగా ప‌లాస కేంద్రంగా ఇచ్ఛాపురం,సోంపేట,మంద‌స, వ‌జ్ర‌పుకొత్తూరు, క‌విటి, కంచిలి, నందిగాంతో కూడిన డివిజ‌న్ ఏర్పాటు అయింది. ఇదొక్క‌టే జిల్లాకు ఊర‌ట‌నిస్తున్న ప‌రిణామం. ఇది మిన‌హా జిల్లాకు పెద్ద‌గా విభ‌జ‌న‌తో ఒన‌గూరింది ఏమీ లేదు. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్ న‌డిపే విద్యా సంస్థ‌లు, ఇతక పారిశ్రామిక వాడ‌లు ఉన్న ప్రాంతం రాజాం విజ‌య‌న‌గ‌రం జిల్లాలోకి వెళ్లిపోయింది.

ఆఖరి నిమిషంలో రాజాం కేంద్రంగా రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటు అవుతుంది అని భావించినా అది కూడా సాధ్యం కాలేదు. దాని స్థానంలోనే బొత్స (మంత్రి) ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీపురు ప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్ గా ఎనౌన్స్ అయింది. ఈ క‌ల సాకారానికి కూడా టీడీపీనే కృషి చేసింది. చాలా వ‌ర‌కూ టీడీపీ అభ్య‌ర్థ‌న‌లే ఫ‌లించాయి. కానీ ఆఖ‌రు నిమిషంలో ఇదంతా త‌మ ఘ‌న‌తే అని బొత్స మేన‌ల్లుడు చిన శ్రీ‌ను  (విజ‌య‌న‌గ‌రం జెడ్పీ చైర్మ‌న్) లాంటి వారు చెబుతుండ‌డ‌మే ఆశ్చ‌ర్య‌క‌రం అని ప్ర‌ధాన విప‌క్షం అంటోంది. 
Tags:    

Similar News