గతంలో కంటే కంటే గొప్ప నాటకం... కూటమి మేనిఫెస్టోపై సజ్జల ఫైర్!

దీంతో... కూటమి మేనిఫెస్టోపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-02 13:32 GMT

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చే హామీలకు, చేసే వాగ్ధానాలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాటవేసే మాటలకు, ఆ విషయంపై ప్రశ్నించిన వారిపై రియాక్ట్ అయ్యే విధానానికీ ఏమాత్రం పొంతన ఉండదనే విమర్శలు రాజకీయవర్గాల్లో రొటీన్ అని అంటుంటారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో తాజాగా కూటమిలో భాగంగా టీడీపీ - జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. దీంతో... కూటమి మేనిఫెస్టోపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా విడుదలైన టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై వైసీపీ పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాదు. ఈ సందర్భంగా 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలతో పాటు 1999నాడు ఇచ్చిన హామీలనూ ప్రస్థావించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి అబద్దాల మ్యానిఫెస్టోతో ఊదరగొడుతున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా... చంద్రబాబువి సొల్లు హామీలనే విషయం ప్రజలకి తెలుసు అని మొదలుపెట్టిన సజ్జల... సూపర్ సిక్స్ అని 6 నెలల ముందు నుండే ఊదరగొడుతూ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేశారని.. ఆయన ఇచ్చిన హామీలకు ఇప్పుడవుతున్నదానికంటే చాలా ఎక్కువ అవుతుందని.. రాష్ట్రం అప్పుల్లో ఉందని బలంగా చెప్పే చంద్రబాబు అంత సంపద ఎలా తెస్తారో చెప్పలేదని అన్నారు.

ఇదే క్రమంలో... గతంలో రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, సున్నా వడ్డీపై అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు.. చివరికి రకరకాల షరతులు పెట్టి కోత కోశారని గుర్తుచేసిన సజ్జల... చంద్రబాబు అమలు చేయకపోతే తాము అధికారంలోకి వచ్చాక సుమారు 26వేల కోట్ల డ్వాక్రా హామీలు అమలు చేశామని తెలిపారు. ఊకదంపుడు హామీలిచ్చే చంద్రబాబు ఆ పథకాలకు అర్హత ఏంటో మాత్రం ముందే చెప్పే దమ్ము కలిగి లేరని ఎద్దేవా చేశారు!

Read more!

అలా డ్వాక్రా రుణాలే కాదు.. 2014లో నిరుద్యోగ భృతి అని ప్రకటించి యువతను మోసం చేశారని.. తీరా ప్రభుత్వం చివరి దశకు వచ్చేసరికి కోటి మంది ఉన్న నిరుద్యోగులను వడపోసి లక్ష 60 వేల మందికి భృతి ఇచ్చారని తెలిపారు! ఇలా... చంద్రబాబు ఇచ్చే హామీలలో కనీసం అర్హులు అన్న మాట కూడా ఉండదని.. ప్రజలంటే చంద్రబాబుకు ఏమాత్రం బాధ్యత లేదని సజ్జల ఫైరయ్యారు. ఇది ఇప్పుడే 2014లోనే కాదని... 1999లో ముఖ్యమంత్రి అయిన సమయంలో కూడా 35లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తా చెప్పిన చంద్రబాబు... అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కట్టారో చెప్పగలరా అని ప్రశ్నించారు!

ఇక కూటమి మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర లేకపోవడంపై చంద్రబాబు చెప్పిన వెర్షన్ పూర్తిగా సత్యదూరమని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి... ఉమ్మడి మ్యానిఫెస్టోని అంటరానితనంలా బీజేపీ చూసిందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో స్టేట్ మ్యానిఫెస్టో విడుదల చేసిన బీజేపీ... చంద్రబాబు మ్యానిఫెస్టో చూసి ఓన్ చేసుకోలేకపోయిందని.. చంద్రబాబు ముంచుతాడని బీజేపీ వాళ్ళకి ముందే తెలిసినందుకే తెలివిగా పక్కకి తప్పుకున్నారని అన్నారు.

4

ఇదే క్రమంలో చంద్రబాబు రెండో సంతకం చేస్తానని చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై స్పందించిన సజ్జల... అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందే బీజేపీ అని.. పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీని అడగొచ్చని.. నీతి ఆయోగ్ సూచనలు మేరకు కేంద్రం తెచ్చిన యాక్ట్ ఇదని.. మహారాష్ట్రలో ప్రయోగం చేసి దానిని దేశమంతా ఆచరణలోకి బీజేపీ తెస్తోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... మైనారిటీల 4శాతం రిజర్వేషన్ ఉండదని బీజేపీ అంటోన్న నేపథ్యంలో... దాని మీద టీడీపీ వైఖరి ఏంటో ప్రజలకి చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News