మొంథా తుఫాన్: లైవ్ అప్‌డేట్స్
మోంతా తుఫాన్ బలంగా మారి ఇప్పుడు తీవ్ర చండమారుతంగా మారింది.;
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ మంగళవారం ఉదయం తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్‌పై తాజా అప్‌డేట్‌లు మీ కోసం ఇక్కడ ఉన్నాయి.
➡️ Cyclone Montha ఇప్పుడు Andhra Pradesh తీరాన్ని వీక్షిస్తున్నది.
➡️ India Meteorological Department (IMD) నాలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ విధించింది — భారీ వర్షాలు, గాలులు రావచ్చు.
మంథా ఎఫెక్ట్ : కృష్ణ జిల్లా లో మొంథా ప్రభావం.. మోపిదేవిలో నేలవాలిన అరటి పంటలు
మంథా ఎఫెక్ట్ : శ్రీకాకుళం జిల్లా లో పెరుగుతున్న వర్ష తీవ్రత
మంథా ఎఫెక్ట్ : కాకినాడ పోర్ట్ కు పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
దిశ మార్చుకున్న మొంథా తుఫాన్ ఇప్పుడు అమలాపురం–యానాం ప్రాంతం వైపు కదులుతోంది.
సముద్ర తీరానికి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను సురక్షితమైన పక్కా ఇళ్లకు లేదా శిబిరాలకు తక్షణం తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక కోనసీమలో గాలుల తీవ్రత కారణంగా కొబ్బరి చెట్లు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మరణించినట్లు సమాచారం.
‘మొంథా’ తుఫాన్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత, నారాయణ, అలాగే సీఎస్ విజయానంద్ హాజరయ్యారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. గత తుఫాన్లలో జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
కాకినాడ మరియు పరిసర ప్రాంతాల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున, సహాయక బృందాలను వెంటనే అక్కడికి పంపించాలని ఆదేశించారు.
గాలులు, వర్షాల తీవ్రతను అంచనా వేసి, ప్రజల భద్రత కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
🚨 తుపాను మోన్థా అలర్ట్! 🌧️🌊
👉 ప్రస్తుతం మోన్థా తుపాను మచిలీపట్నం నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది.
👉 ఈ రాత్రే కాకినాడ–మచిలీపట్నం తీరాల మధ్య తుపాను భూమిని తాకే అవకాశం ఉంది.
👉 గాలులు గంటకు 90–110 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
👉 ఇప్పటికే తీరప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.
👉 శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
⚠️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి.
మొంథా ఎఫెక్ట్ : యారాడలో విరిగిపడ్డ కొండాచెర్యలు
తీవ్ర తుఫాన్ కొద్దికొద్దిగా కొనసీమ వైపు కదులుతోంది. ఇప్పటివరకు నెల్లూరు–ప్రకాశం తీర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు బాపట్ల, కృష్ణా జిల్లాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తున్నాయి.
ప్రస్తుతం మొంథా తుఫాన్ కాకినాడకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకు 410 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుఫాన్ నెమ్మదిగా ఆంధ్ర తీరానికి చేరుకుంటూ, బలమైన గాలులు, ఉప్పొంగిన సముద్ర అలలు ఏర్పడుతున్నాయి.
మొంథా ఎఫెక్ట్ : AP వ్యాప్తంగా భారీ వర్షాలు...పలు చోట్ల కూలిన చెట్లు