‘మొంథా’ తుఫాన్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి... ... మొంథా తుఫాన్‌: లైవ్ అప్‌డేట్స్‌

‘మొంథా’ తుఫాన్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత, నారాయణ, అలాగే సీఎస్ విజయానంద్ హాజరయ్యారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. గత తుఫాన్లలో జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

కాకినాడ మరియు పరిసర ప్రాంతాల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున, సహాయక బృందాలను వెంటనే అక్కడికి పంపించాలని ఆదేశించారు.

గాలులు, వర్షాల తీవ్రతను అంచనా వేసి, ప్రజల భద్రత కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. సీఎస్ విజయానంద్‌ మాట్లాడుతూ, తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

Update: 2025-10-28 07:57 GMT

Linked news