హిస్టరీ రిపీట్.. జయలలిత బాటలో త్రిష!
తమిళ చిత్ర పరిశ్రమలో 'తళపతి'గా వెలుగొందుతున్న విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.;
తమిళ చిత్ర పరిశ్రమలో 'తళపతి'గా వెలుగొందుతున్న విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన విభేదాలు, భార్య సంగీత విడాకుల పిటిషన్ వేయడం ప్రస్తుతం కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. ఈ వివాదాల నడిమధ్యలో నటి త్రిషతో కలిసి విజయ్ ఒక బహిరంగ వేడుకలో కనిపించడం చర్చలకు దారితీసింది. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత జోడీలాగే.. ఇప్పుడు విజయ్, త్రిషల ప్రస్థానం కూడా రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించబోతోందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వివరాల లోకి వెళితే ..
విజయ్ రాజకీయ ఎంట్రీ.. వ్యక్తిగత జీవితంలో కుదుపు:
విజయ్ తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా 2026 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక దాదాపు 28 ఏళ్ల వైవాహిక బంధం ముగింపు దశకు చేరుకోవడం, పిల్లలు కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారనే వార్తలు విజయ్ ఇమేజ్‌పై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా ఓటర్లు నాయకుడి వ్యక్తిగత క్రమశిక్షణను గమనిస్తారని, ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, విజయ్ మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నారు.
జయలలితను గుర్తు చేస్తున్న త్రిష.. పార్టీలో కీలక పాత్ర:
ఒకప్పుడు ఎంజీఆర్ - జయలలిత వెండితెరపై సూపర్ హిట్ జోడీగా అలరించి, ఆ తర్వాత రాజకీయాల్లోనూ కలిసి ప్రయాణించారు. ఎంజీఆర్ తర్వాత జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించిన తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజయ్, త్రిషల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అంతే అద్భుతంగా పండింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి హాజరుకావడంతో, విజయ్ కొత్త పార్టీలో త్రిష కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే, జయలలిత తరహాలోనే త్రిష కూడా రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సవాల్‌గా మారిన రాజకీయ భవిష్యత్తు:
సినిమా గ్లామర్ రాజకీయాల్లో రాణించడానికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ, వ్యక్తిగత వివాదాలు మైనస్‌గా మారే అవకాశం ఉంది. విజయ్ తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం కంటే, తన పని ద్వారా ప్రజల మనసు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు విడాకుల కేసు, మరోవైపు త్రిషతో ఉన్న సాన్నిహిత్యంపై వస్తున్న వార్తలు ఆయనను డిఫెన్స్‌లో పడేస్తాయా లేదా అనేది చూడాలి. ఇక ఏదేమైనా, తమిళ రాజకీయాల్లో మళ్ళీ ఒక 'సినీ జంట' చక్రం తిప్పబోతోందన్న వార్తలు మాత్రం ప్రజల్లో అమితాసక్తిని కలిగిస్తున్నాయి.