మార్చి 21న భారత్ అటాక్ చేస్తుంది?.. జ్యోతిషురాలి వీడియో వైరల్

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఒక ప్రముఖ జ్యోతిషురాలు చేసిన జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.;

Update: 2026-03-06 06:56 GMT

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఒక ప్రముఖ జ్యోతిషురాలు చేసిన జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మార్చి 21వ తేదీన భారత్, పాకిస్థాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని, దీనివల్ల మన దేశ సరిహద్దులే మారిపోతాయని ఆమె అంచనా వేశారు. గతంలో ఆమె చెప్పిన కొన్ని రాజకీయ మార్పులు నిజమవ్వడంతో, ఇప్పుడు ఈ యుద్ధ ప్రకటన జనాల్లో తీవ్ర ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తోంది. అసలు ఆ ఆమె చెప్పిన విడియో లో ఏముందో ఇప్పుడు చూద్దాం.

సరిహద్దులు మారుతాయా:

జ్యోతిషురాలు రీనా శర్మ గ్రహాల స్థితిగతులను విశ్లేషించి ఈ సంచలన విషయాలను బయటపెట్టారు. ఆమె అంచనా ప్రకారం, ఈ నెల 21వ తేదీన భారత్ మరియు అఫ్గానిస్థాన్ కలిసి పాకిస్థాన్‌ను చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి ఇండియాలో కలవడం ఈ సమయం నుంచే మొదలవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఖగోళంలోని గ్రహాల కదలికలు దేశ భవిష్యత్తును మార్చేలా ఉన్నాయని, భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే సమయం ఆసన్నమైందని ఆమె ఆ వీడియోలో వివరించడం ఇది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ముందే ఊహించిన నితీశ్ మార్పు:

రీనా శర్మ మాటలను అంత తేలిగ్గా తీసిపారేయలేమని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదవి నుంచి దిగిపోతారని ఆమె ముందే ఊహించారు. ఇక అలాగే ఇరాన్‌పై జరగబోయే దాడుల గురించి కూడా ఆమె జ్యోతిష్యం నిజమైంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌పై దాడి జరుగుతుందన్న ఆమె మాటలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జ్యోతిష్యం ప్రకారం మార్చి నెలలో జరిగే గ్రహ మార్పులు యుద్ధ వాతావరణానికి దారితీస్తాయని, ఇది భారత్‌కు అనుకూలంగా మారుతుందని ఆమె విశ్లేషించారు.

సోషల్ మీడియాలో హల్ చల్:

ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్, ట్విట్టర్ వంటి వేదికల్లో తెగ షేర్ అవుతోంది. కొందరు ఇది కేవలం అంచనా మాత్రమే అని కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం దేశ రక్షణ విషయంలో ఏదైనా జరగొచ్చని అభిప్రాయపడుతున్నారు.ఇక ఏది ఏమైనా, సరిహద్దుల్లో ఇప్పటికే నిఘా పెరిగిన తరుణంలో ఇటువంటి వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇవన్నీ జ్యోతిష్యపరమైన అంచనాలు మాత్రమే అని, అధికారికంగా ఎటువంటి ప్రకటనలు లేవని గమనించాలి. మార్చి 21న నిజంగానే పరిస్థితులు మారుతాయా లేదా అనేది వేచి చూడాలి.




Tags:    

Similar News