ఆపరేషన్ సింధూర్ : పాకిస్తాన్ ఆర్మీ టీవీలో గెలిచింది.. భారత్ బోర్డర్లో గెలిచింది!
అక్కడ భారత్ కొట్టిన దెబ్బకి మన రక్షణ వ్యవస్థ ఊడ్చిపెట్టుకుపోతే.. మీరు జనాలకి సోషల్ మీడియాలో కలరింగ్ స్టోరీలు చెప్తున్నారా?" నొరీన్ నియాజీ సంచలన ఇంటర్వ్యూ పాక్ లో సంచలనం రేపుతోంది.
పాకిస్తాన్ ఆర్మీ కింగ్ సైజ్ కలలకు మళ్ళీ ఒక పెద్ద సైజ్ కన్నం పడింది. పహెల్గామ్ ఉగ్రదాడికి భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తే.. మన పొరుగు దేశం దాన్నొక "గొప్ప విజయం" అని పోస్టర్లు వేసి పండగ చేసుకుంది. కట్ చేస్తే... అసలు నిజాలు బయటపడి పాక్ ఆర్మీ అసలు రంగు బయటపడింది. అది కూడా ఎవరో పరాయి వాళ్లు చెప్పలేదు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారి తోబుట్టువు, నొరీన్ నియాజీ అమ్మగారే మైకు ముందు నిలబడి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపెట్టారు. ఆర్మీ భయ్యా.. అక్కడ భారత్ కొట్టిన దెబ్బకి మన రక్షణ వ్యవస్థ ఊడ్చిపెట్టుకుపోతే.. మీరు జనాలకి సోషల్ మీడియాలో కలరింగ్ స్టోరీలు చెప్తున్నారా?" నొరీన్ నియాజీ సంచలన ఇంటర్వ్యూ పాక్ లో సంచలనం రేపుతోంది.
టీవీలో విజయం.. రియాలిటీలో సున్నా
నొరీన్ మేడమ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాక్ సైన్యం బిల్డప్‌ని పటాపంచలు చేశారు. అనుకున్న లక్ష్యాలను పక్కాగా స్కెచ్ వేసి అనుకున్నట్లుగా ఫినిషింగ్ ఇచ్చేసింది. క్షేత్రస్థాయిలో భారత్ బాదేస్తుంటే.. ఇటువైపు ప్రెస్ మీట్లు పెట్టి "మేమే గెలిచాం గురూ!" అని సొంత డబ్బా కొట్టుకుంది. పాక్ జనరల్స్ సొంత ప్రజలకే అబద్ధాల కథలు చెప్పి ఎంత బాగా మభ్యపెట్టారో ఆమె ఏకిపారేశారు. టీవీ స్క్రీన్ల మీద యుద్ధాలు గెలవడం పాక్ ఆర్మీకి కొత్తేమీ కాదు లెండి.
ఇజ్రాయెల్ డ్రామా.. ట్రంప్ గారి ఎంట్రీ
ఆమె వ్యాఖ్యలు అక్కడితో ఆగలేదు, కాస్త గ్లోబల్ రేంజ్‌కి తీసుకెళ్లారు. భారత్ ఈ దెబ్బతో ఊరుకోకుండా రప్ఫాడిస్తుందేమోనని భయపడి పాక్ సైన్యం వెనకటి తలుపుల ద్వారా ఇజ్రాయెల్‌తో కన్నుకొట్టి అబ్రహం ఒప్పందాల దిశగా సైగలు చేసిందట. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించి.. అప్పటికప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వేడుకోగా.. ఆయన వచ్చి పాక్ నాయకత్వానికి ఓ "సేఫ్ ఎగ్జిట్" రూట్ మ్యాప్ ఇచ్చారట.. ఈ ఊహాగానాలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే.. "నా దగ్గర ఆధారాలు లేవు కానీ ఆరోపణలు మాత్రం గట్టిగా ఉన్నాయి" అని మేడమ్ నవ్వేయడమే తక్కువ..
పాక్ సైన్యానికి కోపం.. నోటీసుల వర్షం
నిజం చెప్తే ఎవరికైనా మండుతుందిగా నొరీన్ నియాజీ వ్యాఖ్యలతో తీవ్రంగా కలవరపడిన పాక్ ప్రభుత్వం, సైనిక వర్గాలు వెంటనే యాక్షన్ లోకి దిగాయి. ఆధారాలు లేకుండా మా "గొప్ప" ఆర్మీ మీద ప్రభుత్వం మీద నిందలు వేస్తారా? అంటూ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమెకు నోటీసులు పంపింది. "దేశ భద్రతతో ఆటలొద్దు, ఇది అచ్చంగా దేశద్రోహమే!" అంటూ అధికార పార్టీ నేతలు మైకులు పట్టుకుని ఊగిపోతున్నారు.
పాకిస్తాన్ లో మళ్లీ పాత రోత
ఏది ఏమైనా నొరీన్ నియాజీ వేసిన ఈ బాంబుతో పాక్ రాజకీయం మళ్ళీ కుతకుత ఉడికిపోతోంది. "ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది? నిజాలు బయటకు తీయాల్సిందే" అని ప్రతిపక్షాలు సీరియస్ అయిపోతుంటే.. "అదంతా ఫేక్" అని ఆర్మీ కవర్ చేసుకునే పనిలో ఉంది. ఏది ఏమైనా "యుద్ధంలో ఓడిపోయినా.. అబద్ధాల్లో మేమే నంబర్ వన్" అని పాక్ ఆర్మీ మరోసారి నిరూపించుకుందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.