రాములమ్మ మంత్రిగా... ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ?
తెలంగాణా కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా అనూహ్యంగా చోటు సంపాదించారు రాములమ్మ విజయశాంతి.
తెలంగాణా కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా అనూహ్యంగా చోటు సంపాదించారు రాములమ్మ విజయశాంతి. ఆమె టీఆర్ఎస్ లో మెదక్ నుంచి ఎంపీగా అయిదేళ్ల పాటు పనిచేశారు. ఆ తరువాత ఆమెకు దక్కిన అధికార పదవి కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ మాత్రమే. ఈ మధ్యలో ఆమె బీజేపీలోకి కూడా వెళ్ళి వచ్చారు. అయితే కమలదళంతో కూడా ఆమెకు కుదరలేదు. మొత్తానికి ఎమ్మెల్సీ అయి మంత్రి కావాలని విజయశాంతి అనుకున్నారని ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ ఏడాది పై దాటిన ఆమె పెద్దల సభలో సభ్యురాలిగానే ఉండిపోయారు. ఈ నేపధ్యంలో అనుకోని వరంగా ఇపుడు లక్కీ చాన్స్ ఆమె తలుపు తడుతోంది అని అంటున్నారు. కొండా సురేఖ మంత్రి వర్గం నుంచి అవుట్ కావడంతో విజయశాంతికి అవకాశాలు రెట్టింపు అయ్యాయని చెబుతున్నారు.
ఇది కూడా అనూహ్యంగా :
ఎమ్మెల్సీగా విజయశాంతి పేరు ఉంటుందని చివరి నిముషం వరకూ చాలా మంది కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలియదు. అలా ఆమె అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎమ్మెల్యే అయిపోయారు. దాని వెనక కేంద్ర అధినాయకత్వం లోని పెద్దల ఆశీస్సులు ఆమెకు నిండుగా ఉన్నాయని అప్పట్లో చర్చించుకున్నారు. ఇపుడు కూడా వారి దీవెనలతోనే ఆమె అనూహ్యంగా అమాత్య పదవిని కూడా చేపడతారు అని అంటున్నారు ఆమె అభిమానులు. ఇక విజయశాంతి సైతం ఈ విషయంలో తన వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఆమె ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉంటూ కాగల కార్యాన్ని అటు నుంచే జరిపించుకోవాలని చూస్తున్నారు అని ఊహాగానాలు అయితే జోరుగా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ లో అలా :
ఇక విజయశాంతి ఎమ్మెల్సీగా పెద్దగా తన పనితీరుతో ఆకట్టుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు అంటున్నాయని చెబుతున్నారు. ఆమె పార్టీ బలోపేతానికి పెద్దగా కృషి చేసింది లేదని అంటున్నారు. ఈ మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసినది కూడా లేదని గుర్తు చేస్తున్నారు. దాంతో పాటుగా ఆమె ఒకటి రెండు సందర్భాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే కొన్ని విమర్శలు చేసి ఇరకాటంలో పెట్టారని కూడా అంటున్నారు. ఆమె స్వతంత్ర్యంగా వ్యవహరిస్తారు అని ఆమెకు మంత్రి పదవి ఇస్తే మళ్లీ ఇబ్బందులు వస్తాయని అంటున్న వారూ ఉన్నారు. కాంగ్రెస్ కేంద్ర పెద్దలు ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం మీద ముఖ్యమంత్రి మీద బాధ్యత ఎక్కువగా పెడుతుందని అంటున్నారు. ఇక మంత్రి వర్గం అన్నది ముఖ్యమంత్రి ఇష్టం ప్రకారమే జరుగుతుందని అంటున్న వారూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో చూస్తే అలా ఉంటుందా అన్నది కూడా సందేహమే అని అంటున్న వరూ ఉన్నారు.
దసరా ముందే ముహూర్తం :
ఇక చూస్తే వచ్చే నెల 20న దసరా పండుగ ఉంది. ఈ పండుగ కంటే కూడా మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు. అక్టోబర్ 11 నుంచి మంచి రోజులు ఉన్నాయని అందువల్ల ఆ వరంలోనే మంత్రి వర్గంలో ఖాళీలను భర్తీ చేస్తారు అని గట్టిగా వినిపిస్తున్న మాట. మరి విజయశాంతికి విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ అని అంటున్నారు. మొత్తానికి రాములమ్మ మినిస్టర్ కావాలంటే కొన్ని అడ్డంకులు ఇంకా దాటాల్సి ఉందని వినిపిస్తున్న మాటగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.