విద్యార్థుల సైడ్ తీసుకున్న మోడీ కేబినెట్ సహచరుడు పాశ్వాన్

ఇక జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. సీజేపీ పెట్టిన డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Update: 2026-07-21 16:58 GMT

విద్యార్ధులు ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిర్వహించిన ఆందోళన ఘర్షణాత్మకమైన తీరుగా సాగడం అందరికీ తెలిసిందే. పోలీసులు టియర్ గ్యాస్ తో ప్రయోగాలు అలాగే లాఠీచార్జి చేయడాలు ఇవన్నీ యావత్తు దేశం చూసింది. అనేకమంది విద్యార్ధులు పోలీస్ లాఠీ దెబ్బలకు దొరికారు, ఇబ్బంది పడ్డారు. ఒక యువతి అయితే సీరియస్ కండిషన్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరో వైపు చూస్తే విద్యార్ధినుల మీద పోలీసులు చేసిన లాఠీ చార్జి పట్ల కూడా సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. సీజేపీ పెట్టిన డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు :

విద్యార్ధుల ఆవేదనను ఎవరైనా గౌరవించాల్సిందే అంటూ మోడీ మంత్రివర్గంలో సభ్యుడు, ఎల్‌జేపీ (ఆర్వీ) అధినేత అయిన చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనను ఎవరైనా అర్ధం చేసుకోవాల్సిందే కానీ బలప్రయోగంతో అణచేందుకు చూడరాదని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించడం విశేషం. ప్రజా స్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలియచేయడం ప్రతీ ఒక్కరి హక్కు అని కూడా అన్నారు. ఏ సమస్యకు అయినా చర్చలే పరిష్కారంగా పాశ్వాన్ పేర్కొన్నారు.

చర్చలే మేలు అంటూ :

విద్యార్ధులు లేవనెత్తుతున్న సమస్యలకు పరిష్కారం చర్చలు మాత్రమే అని ఆయన అన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డా విద్యార్ధులతో సమస్యల మీద చర్చించారు అని ఆయన చెబుతూనే ప్రభుత్వం చర్చలకు ఎపుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారు. ఇక నిరసనలు కూడా హద్దులు దాటరదని అవి లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగిస్తే కచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడడంలో అందరి బాధ్యత ఉందని అన్నారు.

పాశ్వాన్ వ్యాఖ్యల వెనక :

ఇక పాశ్వాన్ బీహార్ కి చెందిన యువ నాయకుడు. ఆయన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ దివంగత నేత. ఈ యువ నేత ఎన్ డీయేలో భాగస్వామిగా ఉంటూ కేంద్ర మంత్రిగా ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలలుగా సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక ఆందోళనలు అలాగే కేంద్రం వైఖరి ఇవన్నీ చర్చలుగానే ఉన్న వేళ మోడీ కేబినెట్ సహచరుడు పాశ్వాన్ విద్యార్ధుల సైడ్ తీసుకుని ఈ విధంగా వారి సమస్యల పట్ల సానుకూలంగా మాట్లాడడం గమనార్హం అని అంటున్నారు. అంతే కాదు విద్యార్ధుల ఆందోళనలను అర్ధం చేసుకోవాలని ఎన్ డీయే మిత్ర పక్ష నేతగా ఆయన ప్రభుత్వానికి కీలకమైన సూచనలను చేశారు అని అంటున్నారు. మరి దీనితో అయినా కేంద్ర పెద్దల ఆలోచనలలో మార్పు వస్తుందా అన్నది ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా చర్చల ద్వారానే విద్యార్ధుల సమస్యలకు ముగింపు పలకాల్సి ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో మిత్రులు కూడా అంత సంతృప్తిగా లేరు అని చెప్పడానికి కేంద్ర మంత్రి పాశ్వాన్ వ్యాఖ్యలు ఒక సంకేతామా అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News