చంద్రబాబు నేషనల్ 'ఇమేజ్'పై వైసీపీ వ్యూహం.. టీడీపీ కీలక నిర్ణయం!
ఇలాంటి కీలక సమయంలో వైసీపీ ఎంపీలు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి.. ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయని, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై పార్లమెంటులో చర్చ పెట్టాలని కోరారు.
రాష్ట్రంలో ప్రతిపక్షంగా(ప్రధాన కాదు) ఉన్న వైసీపీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రంలో నిరసనలు వ్యక్తం చేసే అవకా శం ఉంది. అలాగే.. ప్రభుత్వంపైనా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. కానీ, ప్రత్యక్ష నిరసనల స్థానంలో సోషల్ మీడియాను నమ్ముకు న్న వైసీపీ ఇప్పుడు తాజాగా పార్లమెంటు వేదికగా ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలని నిర్ణయించడం గమనార్హం. తద్వారా జాతీయ స్థాయిలో ఏపీ సమస్యలు ప్రస్తావించి.. సీఎం చంద్రబాబుకు ఉన్న నేషనల్ ఇమేజ్‌ను డ్యామేజీ చేయాలన్న వ్యూహంతో ముం దుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. అయితే.. దీనిని టీడీపీ కూడా గ్రహించడం గమనార్హం.
ఏం చేస్తున్నారు?
సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. సభలు ప్రారంభం కాగానే.. విపక్ష సభ్యులు.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు సహా.. అయోధ్య రామాలయం విరాళాల చోరీ అంశాలను ప్రస్తావిస్తూ.. నినాదాలు చేశారు. ముందుగా ఆయా అంశాలపైనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.. దీంతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. ఇలాంటి కీలక సమయంలో వైసీపీ ఎంపీలు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి.. ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయని, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై పార్లమెంటులో చర్చ పెట్టాలని కోరారు.
అంతేకాదు.. ఈ చర్చకు సంబంధించినిబంధన ప్రకారం.. వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌కు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, ఆయ న దానిని తీసుకోకుండా.. లిస్టు చేయాలని(మంగళవారానికి) సూచించి.. రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై మంగళవారం లేదా వీలునుబట్టి బుధవారం చర్చ చేపట్టనున్నారు. ఇక, ఈ వ్యవహారంపై తిరుపతి పార్లమెంటు సభ్యుడు, వైసీపీ నేత గురుమూర్తి ఏఎన్ ఐతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భధ్రతలు లేకుండా పోయాయని, పోలీసులే ప్రజలను కొట్టి చంపుతున్నారని తెలిపారు. లాక్‌డెత్‌లుపెరుగుతున్నాయని అన్నారు. దీంతో పోలీసు స్టేషన్లకు వెళ్లేందుకు ప్రజలు భయ పడే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే చర్చను కోరుతున్నారు.
తద్వారా ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశవ్యాప్తంగా చర్చకు వస్తాయని ఎంపీ గురుమూర్తి తెలిపారు. కాగా.. ఈ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు కూడా అదే రేంజ్‌లో స్పందించారు. గతంలో వైసీపీ హయాంలో పార్లమెంటులో ఏపీ విషయాలపై చర్చ కోరినప్పుడు.. నానా యాగీ చేశారని, ఏపీలో మౌనంగా ఉండి ఢిల్లీలో గొడవ చేస్తారా? అని ప్రశ్నించారని గతాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు జాతీయస్థాయిలో ఉన్న ఇమేజ్‌కు డ్యామేజీ చేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ఈ వాయిదా తీర్మానాన్ని ఇచ్చిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశారని, డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై పెడ రెక్కలు విరిచి కట్టి ఈడ్చుకుపోయారని, ఓ ఎంపీ నగ్న వీడియో కాల్ మాట్లాడారని.. గతాన్ని తవ్వారు. తాము కూడా వైసీపీకి పార్లమెంటు వేదికగానే సరైన సమాధానం చెబుతామని నంద్యాల ఎంపీ వ్యాఖ్యానించారు.