టెక్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న AI రోబోట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఇది ఒక సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.మరి ఆ స్మార్ట్ ఫోన్ విశేషాలు మనము ఓ లుక్ వేద్దాం..;

Update: 2026-03-05 19:30 GMT

స్మార్ట్‌ఫోన్ కెమెరా అంటే కేవలం ఫొటోలు తీయడమే కాదు, అది ఒక రోబోలా కదిలితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనతో హానర్ కంపెనీ MWC 2026లో తన 'రోబోట్ ఫోన్' కాన్సెప్ట్‌ను పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గింబల్ అవసరం లేకుండానే వ్లాగర్స్, కంటెంట్ క్రియేటర్స్ అదిరిపోయే వీడియోలు తీసుకునేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. స్మార్ట్‌ఫోన్ రంగంలో ఇది ఒక సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.మరి ఆ స్మార్ట్ ఫోన్ విశేషాలు మనము ఓ లుక్ వేద్దాం..

360 డిగ్రీల గింబల్ కెమెరా.. ఇక షేక్స్ ఉండవు:

సాధారణంగా మనం వీడియోలు తీసేటప్పుడు చేతులు వణకడం వల్ల అవుట్‌పుట్ సరిగా రాదు. అందుకే చాలామంది విడిగా గింబల్స్ వాడుతుంటారు. కానీ, హానర్ రోబోట్ ఫోన్‌లో ఫోన్ లోపలే అత్యంత శక్తివంతమైన 200MP కెమెరాను ఒక చిన్నపాటి గింబల్‌పై అమర్చారు. ఇది ఏకంగా 360 డిగ్రీల పాటు రొటేట్ అవుతుంది. అంటే మీరు ఫోన్‌ను పట్టుకుని కదలకపోయినా, కెమెరా తనంతట తానుగా తిరుగుతూ స్మూత్ వీడియోలను రికార్డ్ చేస్తుంది. దీనివల్ల బయట వాడే గాడ్జెట్స్ అవసరం లేకుండానే ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోలను షూట్ చేయవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాజిక్:

ఈ ఫోన్‌లో ఏఐ కేవలం సాఫ్ట్‌వేర్‌కు మాత్రమే పరిమితం కాలేదు, హార్డ్‌వేర్‌తో కలిసి పనిచేస్తుంది. మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు ఎటు కదిలినా కెమెరా మిమ్మల్ని ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోన్ చిన్నపాటి రోబోటిక్ కదలికలు కూడా చేస్తుంది. అవతలి వారు చెప్పేదానికి అవునన్నట్లు తల ఊపడం లేదా డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంది. అందుకే దీనిని 'ఎంబోడీడ్ ఏఐ' స్మార్ట్‌ఫోన్ అని పిలుస్తున్నారు.

ఈ టెక్నాలజీ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నా, కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ఫోన్ లోపల మోటార్లు నిరంతరం కదులుతూ ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అలాగే, మెకానికల్ భాగాలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయా? అనేది వేచి చూడాలి. హానర్ ఈ కాన్సెప్ట్ ఫోన్‌ను ముందుగా చైనాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. అక్కడ సక్సెస్ అయితే శాంసంగ్ వంటి మిగతా కంపెనీలు కూడా ఇలాంటి రోబోటిక్ కెమెరాల వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు, ఒక రోబోటిక్ అసిస్టెంట్‌గా మారుతోంది. హానర్ తెచ్చిన ఈ మార్పు భవిష్యత్తులో మొబైల్ ఫోన్ డిజైన్లను పూర్తిగా మార్చేయవచ్చు. అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News