తీవ్ర తుఫాన్ కొద్దికొద్దిగా కొనసీమ వైపు... ... మొంథా తుఫాన్: లైవ్ అప్‌డేట్స్
తీవ్ర తుఫాన్ కొద్దికొద్దిగా కొనసీమ వైపు కదులుతోంది. ఇప్పటివరకు నెల్లూరు–ప్రకాశం తీర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు బాపట్ల, కృష్ణా జిల్లాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తున్నాయి.
ప్రస్తుతం మొంథా తుఫాన్ కాకినాడకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకు 410 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుఫాన్ నెమ్మదిగా ఆంధ్ర తీరానికి చేరుకుంటూ, బలమైన గాలులు, ఉప్పొంగిన సముద్ర అలలు ఏర్పడుతున్నాయి.
Update: 2025-10-28 06:43 GMT