వాట్సప్ లో దైవదూషణ... మరణశిక్ష విధించిన కోర్టు!

ఇటీవల యూట్యూబ్ వేదికగా ఈ బ్యాచ్ ఎక్కువయ్యారనే చర్చా నడుస్తుంది.

Update: 2024-03-09 06:10 GMT

వాస్తవానికి ఏ మతస్తులైనప్పటికీ... వారి వారి మతాలను, ఆచారాలను గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో.. ఇతర మతాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో చాలా మంది ఇంగితం మరిచిపోతుంటారు! ఇతర మతాలపై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. వారి వారి మతాచారాలను అవహేళన చేస్తుంటారు. ఇటీవల యూట్యూబ్ వేదికగా ఈ బ్యాచ్ ఎక్కువయ్యారనే చర్చా నడుస్తుంది.

తమకు మాత్రమే సొంతమైన అర్ధజ్ఞానంతో, పూర్తి అవగాహనా రాహిత్యంతో ఇతర మతాలపై పనికిమాలిన లాజిక్కులు తీసుంటారు. తమ మతమే గొప్పదని చెప్పుకు తిరుగుతుంటారు. పరమత సహనం అనే విషయాన్నే పరిగణలోకి తీసుకోరు. ఇతర మతాలపై బురదజల్లుతూ కామెంట్లు చేస్తారు. ఈ సమయంలో తాజాగా ఒక యువకుడు అలాంటిపనికే పూనుకున్నాడు. దీంతో ఆ యువకుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడిందింది.

వివరాళ్లోకి వెళ్తే... పాకిస్థాన్ లో 22 ఏళ్ల యువకుడు ఒకరు దైవదూషణకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా వాట్సప్ వేదికగా... మహ్మద్ ప్రవక్త, అతని భార్యల గురించి కించపరిచేలా ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి షేర్ చేస్తున్నాడంట. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని తాజాగా కోర్టు నిర్ధారించింది.

ఉద్దేశపూర్వకంగానే మతపరమైన భావాలను కించపరిచేలా ఈ మెసేజ్ లను షేర్ చేసినట్లు కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో 22 ఏళ్ల ఆ యువకుడికి పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కోర్టు మరణ శిఖ విధించింది.

కాగా... పాకిస్థాన్ లో దైవదూషణను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. గతంలో దైవ దూషణకు పాల్పడినవారిని అక్కడ కోర్టు శిక్షించడానికి ముందే రాళ్లతో కొట్టిచంపిన ఘటనలు కూడా ఉన్నాయని చెబుతారు. ఈ క్రమంలో గత ఏడాది జూన్ లో కూడా దైవ దూషణకు పాల్పడ్డాడంటూ ఒక యువకుడికి పాకిస్థాన్ కోర్టు మరణశిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది.

Tags:    

Similar News