జ‌గ‌న్ చేత స్విచ్ నొక్కించారు.. ఫ‌డ్న‌వీస్ చేత టెంకాయ కొట్టించారు

Update: 2019-06-21 06:58 GMT
ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు అతిధులుగా వ‌చ్చిన‌ప్పుడు వారికి స‌మ ప్రాధాన్య‌త ల‌భించేలా చేయాల్సిన అవ‌సరం ఉంటుంది. ఈ విష‌యంలో ఏ మాత్రం త‌ప్పు దొర్లినా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉంటుంది. ఇలాంటివి ముందే గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప‌క్కాగా ప్లాన్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

యాగం పూర్తి అయ్యే స‌మ‌యానికి అతిధులంతా చేరుకున్నారు. యాగం పూర్తి అయ్యాక‌.. ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శిలాఫ‌ల‌కాన్ని రిమోట్ తో ప్రారంభించే కార్య‌క్ర‌మాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేత చేయించారు కేసీఆర్‌. రిమోట్ మీట‌ను జ‌గ‌న్ నొక్క‌టం ద్వారా శిలాఫ‌ల‌కానికి ఏర్పాటు చేసిన ప‌ట్టు వ‌స్త్రం ప‌క్క‌కు వెళ్ల‌టంలో శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రణ కార్య‌క్ర‌మం పూర్తి అయ్యింది.

అనంత‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ముందు కొబ్బ‌రికాయ‌లు కొట్టించే కార్య‌క్ర‌మానికి మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ చేత మొద‌టి టెంకాయ కొట్టించిన కేసీఆర్‌.. రెండో టెంకాయ‌ను గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చేత కొట్టించారు. మూడో కొబ్బ‌రికాయ జ‌గ‌న్ కొట్ట‌గా.. నాలుగో కొబ్బ‌రికాయ కేసీఆర్ కొట్టారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ చేత ప్రారంభించారు. ఆ త‌ర్వాత జ‌లాశ‌యంలో ప‌సుపుకుంకుమ‌.. న‌వ‌ధాన్యాలు.. నాణెలు వేసే కార్య్ర‌మాన్ని సైతం ఫ‌డ్నీవీస్ చేత ద‌గ్గ‌ర ఉండి చేయించారు కేసీఆర్‌. మొత్తంగా చూస్తే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి సంబంధించి హాజ‌రైన అతిధుల‌కు స‌మ ప్రాధాన్య‌త ఇచ్చిన దృశ్యం క‌నిపించింది.  


Tags:    

Similar News