ఫ్రమ్ ఎర్త్ టుస్కై... 2025లో ఐదు అద్భుతమైన ఆవిష్కరణలు!

ఈ ఏడాది (2025)లో సైన్స్ ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేసింది. ఇందులో భూమి మీద నుంచి అంతరిక్షం వరకూ ఉన్నాయి. వీటిలో సుమారు 4 లక్షల ఏళ్ల నాటి విషయాలు ఉన్నాయి..;

Update: 2025-12-27 08:30 GMT

ఈ ఏడాది (2025)లో సైన్స్ ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేసింది. ఇందులో భూమి మీద నుంచి అంతరిక్షం వరకూ ఉన్నాయి. వీటిలో సుమారు 4 లక్షల ఏళ్ల నాటి విషయాలు ఉన్నాయి.. భవిష్యత్తు ఆశాకిరణాలు ఉన్నాయి! ఇందులో మానవ చరిత్రలోని ఎన్నో మలుపులూ ఉన్నాయి.. మళ్లీ 2040 వరకూ కనిపించని అరుదైన దృశ్యాలూ ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దామ్...!

అవును... డైనోసార్ పాదముద్రల నుంచి, చంద్రుని శిల నమూనాలు యూకేకి వచ్చి చేరడం వరకూ.. అసలు మనిషి అగ్నిని ఎప్పుడు కనుగొన్నాడు దగ్గర నుంచి చింపాజీలు తమ గాయాలకు ఆకు పసరులు పూసుకోవడం వరకూ ఈ ఏడాది సైన్స్ ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలను చేసింది!

యూకేకి వచ్చిన చంద్రుని శిల నమూనాలు!:

సుమారు 50 ఏళ్ల తర్వాత మొదటిసారిగా.. చంద్రుని శిల నమూనాలు చైనా నుంచి భూమి మీదకు వచ్చాయి. ఈ చిన్న ధూళి రేణువులను ఇప్పుడు మిల్టన్ క్రీన్స్ లోని అత్యధిక భద్రతా సౌకర్యాలలో నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ పదార్థాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతి ఉన్న ఏకైక వ్యక్తి యూకే శాస్త్రవేత ప్రొఫెసర్ మహేష్ ఆనంద్ వీటిని అధ్యయనం చేస్తున్నారు. శాస్త్రీయ విలువల కారణంగా బంగారం కంటే ఇది విలువైనదని చెబుతున్నారు.

4 లక్షల ఏళ్ల క్రితమే మనిషి పుట్టించిన మంట!

సఫోల్క్‌ లోని బార్న్‌ హామ్‌ లో ఉన్న ఒక పురావస్తు ప్రదేశంలో.. పరిశోధకులు అగ్నికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తించారు! ఇందులో భాగంగా.. సుమారు 4,00,000 సంవత్సరాల నాటి మానవ నిర్మిత అగ్నిప్రమాదానికి సంబంధించిన అద్భుతమైన ఆధారాలను కనుగొన్నారు. అగ్ని తయారీ మూలాలను 3,50,000 సంవత్సరాల కంటే వెనక్కి నెట్టివేసి మానవ పరిణామంలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని ఈ ఆవిష్కరణ సూచిస్తుంది.

ఏడు గ్రహాల అరుదైన కవాతు!:

ఈ ఏడాది అంతరిక్షంలో ఓ అద్భుతం కనిపించింది. ఇందులో భాగంగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడు గ్రహాలూ ఒకేసారి ఆకాశంలో కనిపించాయి.. అరుదైన ఖలోళ ప్రదర్శనను అందించాయి. ఇందులో భాగంగా.. అంగారకుడు, బృహస్పతి, యురేనస్, బుధుడు, శుక్రుడు, శని, నెఫ్ట్యూన్ గ్రహాలు కవాతులో పాల్గొన్నాయి. ఇందులో నాలుగు కంటికి నేరుగా కనిపించగా.. శని, యురేనస్, నెఫ్ట్యూన్ లకు టెలిస్కోప్ అవసరమైంది. ఇలాంటి దృశ్యం మళ్లీ 2040 వరకూ కనిపించదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

166 మిలియన్ ఏళ్ల నాటి డైనోసార్ పాదముద్రలు!:

ఆక్స్ ఫర్డ్ షైర్ లోని ఒక క్వారీ ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ ట్రాక్ వే సైట్ లలో ఒకదాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా... సుమారు 166 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి సుమారు 200 పాదముద్రలు కనిపించాయి. ఈ ట్రాక్ లు రెండు విభిన్నమైన డైనోసార్ కదలికలను సంగ్రహిస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... అవి పొడవాటి మెడ గల సౌరోపాడ్ లు, రెండు కాళ్ల మాంసాహార మెగాలోసారస్ లు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చింపాజీలకు తెలిసిన పసరు వైద్యం!:

ఉగాండాలో అడవి చింపాజీలు తమ గాయాలకు చికిత్స చేసుకోవడానికి మొక్కలను ఉపయోగిస్తున్నట్లు చిత్రీకరించబడ్డాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు, స్థానిక బృందంతో కలిసి పని చేస్తూ.. ఈ జంతువులు తమ గాయాలకు మొక్కల ఆకులను పూసుకోవడాన్ని గమనించారు. ఈ ఫలితాలు.. మానవునికి దగ్గర బంధువులుగా చెప్పే చింపాంజీల సహజ నివారణల గురించి ఆశ్చర్యకరమైన జ్ఞానాన్ని వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News