ఇద్దరమ్మాయిల పెళ్లి.. ఏడడుగులు ఎలా వేశారో తెలిస్తే అవాక్కే
అబ్బాయి.. మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవటం.. అమ్మాయి.. మరో అమ్మాయిని వివామాడటం కొంత కాలంగా జరుగుతున్నవే. ప్రాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. మన దేశంలో తక్కువే.;
అబ్బాయి.. మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవటం.. అమ్మాయి.. మరో అమ్మాయిని వివామాడటం కొంత కాలంగా జరుగుతున్నవే. ప్రాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. మన దేశంలో తక్కువే. అయినప్పటికి అప్పుడప్పుడు వీటికి సంబంధించిన ఉదంతాలు వెలుగు చేసి షాకిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బిహార్ లో చోటు చేసుకుంది.
ఆ రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఇద్దరు యువతులు పూజా గుప్తా (21), కాజల్ కుమారి (18) ఇద్దరూ ఒక మాల్ లో పని చేస్తుంటారు. వారి స్నేహం చివరకు వారి మధ్యో సిత్రమైన బంధానికి తెర తీసింది. దీంతో.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా సుపాల్ పట్టణంలోని కాళీమాత మందిరంలో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ.. అనంతరం చేసిన పనితో సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యారు. పెళ్లి సందర్భంగా హోమం చుట్టూ దంపతులు ఇద్దరూ ఏడు అడుగులు వేయటం తెలిసిందే.
అందుకు భిన్నంగా వీరిద్దరూ మాత్రం ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ పొయ్యి(సిలిండర్ కం పొయ్యి)ని వెలిగించి.. ఆ మంట చుట్టూ ఏడు అడుగులు వేయటం.. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. తమ పెళ్లి ఫోటోలు.. గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడు అడుగులు నడిచిన ఫోటోల్ని వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో.. వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.