సేఫ్ జోన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్...కూటమి సర్కార్ లో సైతం !
కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక చాలా మంది వైసీపీ నేతలకు చుక్కలు కనిపించాయి. అసలు వారు ఎప్పటికీ చిక్కరు దొరకరు అనుకున్న వారు అంతా కూడా అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు.;
కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక చాలా మంది వైసీపీ నేతలకు చుక్కలు కనిపించాయి. అసలు వారు ఎప్పటికీ చిక్కరు దొరకరు అనుకున్న వారు అంతా కూడా అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు. నెలల తరబడి అందులో ఉంటూ అష్టకష్టాలు పడ్డారు. రెడ్ బుక్ పేరుతో అనేక మందిని జైళ్ళలో పెడుతున్నారు వైసీపీ అధినాయకత్వం ఆగ్రహించినా చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెబుతూ చాలా మంది మీద కేసులు పెట్టారు. జగన్ కి అత్యంత సన్నిహిత నేతలు కూడా జైలు దారి చూశారు. వైసీపీకి పార్లమెంట్ లో లీడర్ అయిన మిధున్ రెడ్డి కూడా రాజమండ్రి జైలులో ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ ఇలా లిస్ట్ చాలానే ఉంది. కానీ కూటమి అధికారంలోకి రాగానే ఆయనే ఫస్ట్ టార్గెట్ అవుతారు అనుకున్న ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. అలా ఎందుకు జరుగుతోంది ఆ కధా కమామీషూ ఏమిటి అన్నది హాట్ డిస్కషన్ గా ఇపుడు ఉంది.
ద్వారంపూడి విషయంలో :
గోదావరి జిల్లాలలో వైసీపీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత ప్రముఖ నేత అన్నది అందరికీ తెలిసిందే. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి కీలకంగా మారారు. గోదావరి రాజకీయాన్ని వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఒంటి చేత్తో శాసించిన ఆయన డైరెక్ట్ గా పవన్ తోనే ఢీ కొట్టారు. గోదావరి జిల్లాలలో పవన్ వారాహి యాత్ర జరిగితే ఆయన స్పీచ్ అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చిన డేరింగ్ లీడర్ గా ద్వారంపూడిని అంతా చెప్పుకున్నారు. ఇక జనసేన వర్సెస్ ద్వారంపూడిగా కాకినాడ రాజకీయం మరో ఎత్తుగా వేడిగా వాడిగా సాగిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. అయితే ద్వారంపూడి విషయంలో కూటమి ఇప్పటిదాకా ఏ విధంగానూ యాక్షన్ లోకి దిగకపోవడం మీద కూటమి పార్టీలలోనే చర్చ సాగుతోందిట.
రేషన్ బియ్యం అంటూ :
ద్వారంపూడి మీద కూటమి నుంచి పదునైన విమర్శలే వచ్చాయి. అక్రమంగా రేషన్ బియ్యం ఏపీ నుంచి అనేక దేశాలకు తరలిస్తూ భారీ వ్యాపారం చేస్తున్నారు అని కూడా కూటమి నేతలు ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారని అంటున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని తమది ఆ తరహా వ్యాపారం కాదని ద్వారంపూడి వివరణ కూడా ఇచ్చుకున్నారు. అది వేరే విషయం కానీ అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం మీద కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని దర్యాప్తు దశలో ఉందని కూడా అప్పట్లో చెబుతూ వచ్చారు. కానీ ఇపుడు అయితే అసలు ఆ ఊసే లేదని అంటున్నారు.
సైలెంట్ గానే ఆయన :
అయితే రాజకీయంగా ఎంతో వ్యూహం కలిగిన చతురుడిగా పేరున్న ద్వారంపూడి ప్రస్తుతం ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు అని అంటున్నారు. వైసీపీ తరఫున ఆయన యాక్టివిటీ కూడా పెద్దగా ఉండటం లేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కూటమి పార్టీలతో కూడా తన రిలేషన్స్ ని కొనసాగిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన విషయంలో కూటమి పెద్దలు పెద్దగా జోరు చేయడం లేదని అంటున్నారు. అయితే పై స్థాయిలో ఏమి జరుగుతోంది అన్నది క్యాడర్ కి అనవసరం అని అంటున్నారు. జనసేన మీద ద్వారంపూడి అప్పట్లో విరుచుకుపడిన తీరునే ఆ పార్టీ వారు గుర్తు చేసుకుంటున్నారు. అయితే రాజకీయాలు అన్నాక సవాలక్షా స్ట్రాటజీలు ఉంటాయని అందులో భాగమే ఇదంతా అని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి చూస్తే ద్వారంపూడి సేఫ్ జోన్ లోనే ఉన్నారని అంటున్నారు ఇక ఆయన వైసీపీ తరఫున ఎపుడు సౌండ్ చేస్తారు అంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు.