3 గంటల్లో 'ఆ' కంటెంట్ ను తొలగించాలి.. కేంద్రం కీలక ఆదేశాలు!

ఈ తాజా నిబంధనల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించి, సమాజిక మాధ్యమాలకు అప్ లోడ్ చేసే కంటెంట్ తప్పనిసరిగా ఐడెంటిఫైయర్ లను కలిగి ఉండాలి.;

Update: 2026-02-11 03:43 GMT

టెక్నాలజీ పెరిగేకొద్దీ దాని దుర్వినియోగం కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వస్తే దాన్ని సద్వినియోగం చేసుకునేవారితో పాటు దాన్ని దుర్వినియోగం చేసేవారూ పెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను దుర్వినియోగం చేస్తూ పనికిమాలిన ఫోటోలు, అభ్యంతరకర వీడియోలు సృష్టిస్తున్న సంగతీ తెలిసిందే. దీనికి సామాన్యులు, సెలబ్రెటీలనే తేడా లేకుండా అంతా బాధితులుగానే ఉన్న పరిస్థితి! ఈ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సెలబ్రెటీల డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న బ్యాచ్ ఇటీవల పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సామాన్యులు సైతం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో బలవుతున్నారనే వార్తలూ వసున్నాయి! ఈ నేపథయంలో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల్లో ఈ తరహా కంటెంట్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.. దీనికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు - 2021లో చేసిన సవరణలను ప్రభుత్వం నోటిఫై చేసింది.

ఈ తాజా నిబంధనల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించి, సమాజిక మాధ్యమాలకు అప్ లోడ్ చేసే కంటెంట్ తప్పనిసరిగా ఐడెంటిఫైయర్ లను కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో.. ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చట్టవిరుద్ధమైన.. లేదా, తప్పుదారి పట్టించే ఏఐ కంటెంట్ గురించి తెలిస్తే మూడు గంటల్లోపూ దానిని తొలగించాల్సి ఉంటుంది. వాస్తవానికి గతంలో ఈ కాలపరిమితి 36 గంటలు ఉండేది. ఇక పాక్షిక లేదా పూర్తి నగ్న ఫోటోలు, వీడియోలు, సెక్స్యువల్ సంబంధిత కంటెంట్ ను 2 గంటల్లోపే తొలగించాల్సి ఉంటుంది!

ఇదే క్రమంలో... చట్టవిరుద్ధమైన, లైంగిక దోపిడీకి సంబంధించిన, తప్పుదారి పట్టించే లేదా మోసపూరితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ ను నిరోధించడానికి ఆటోమేటెడ్ సాధనాలను అమలు చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఆదేశించింది. అదే విధంగా.. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాల గురించి ప్లాట్ ఫామ్ లు కనీసం ప్రతీ మూడు నెలల్కు ఒకసారైనా వినియోగదారులను ఈ మేరకు హెచ్చరించాలి. ఈ తాజా సవరణలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తాయి.

కాగా... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి చాలా మంది సెలబ్రెటీల డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే! ఈ విషయంలో ప్రధానంగా సినిమా హీరోయిన్లు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో పలువురు క్రీడాకారుల ప్రమోషన్ ప్రకటనలు సైతం హల్ చల్ చేయడం కలకలం రేపింది! ఈ నేపథ్యంలో కేంద్రం అలాంటి వాటికి చెక్ పెట్టింది!

Tags:    

Similar News